ప్రజావేదిక కూల్చివేత ముగిసింది.. ఇక చంద్రబాబు ఇల్లే టార్గెట్..?

ప్రజావేదిక కూల్చివేత ప్రక్రియ నేటితో ముగుస్తుంది. ఆ తర్వాత కరకట్ట పై ఉన్న అక్రమ కట్టడాలకు నోటీసులు ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. మాజీ సీఎం చంద్రబాబు ఉంటున్న నివాసానికి కూడా నోటీసులు ఇవ్వబోతున్నట్లు సమాచారం. అయితే అక్రమ కట్టడాల అంశం కోర్టు పరిధిలో ఉంది. ఈ పరిస్థితుల్లో తాజాగా నోటీసులు ఇచ్చిన ప్రభుత్వం ఏ చేయబోతుందనేది చర్చనీయాంశమైంది. మరోవైపు దాదాపు ప్రజావేదిక కూల్చివేత పూర్తైంది. ప్రజావేదిక కూల్చివేత తర్వాత.. పక్కనే ఉన్న […]

ప్రజావేదిక కూల్చివేత ముగిసింది.. ఇక చంద్రబాబు ఇల్లే టార్గెట్..?
Follow us

| Edited By:

Updated on: Jun 27, 2019 | 10:37 AM

ప్రజావేదిక కూల్చివేత ప్రక్రియ నేటితో ముగుస్తుంది. ఆ తర్వాత కరకట్ట పై ఉన్న అక్రమ కట్టడాలకు నోటీసులు ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. మాజీ సీఎం చంద్రబాబు ఉంటున్న నివాసానికి కూడా నోటీసులు ఇవ్వబోతున్నట్లు సమాచారం. అయితే అక్రమ కట్టడాల అంశం కోర్టు పరిధిలో ఉంది. ఈ పరిస్థితుల్లో తాజాగా నోటీసులు ఇచ్చిన ప్రభుత్వం ఏ చేయబోతుందనేది చర్చనీయాంశమైంది. మరోవైపు దాదాపు ప్రజావేదిక కూల్చివేత పూర్తైంది. ప్రజావేదిక కూల్చివేత తర్వాత.. పక్కనే ఉన్న చంద్రబాబు ఇంటిని కూడా ప్రభుత్వం కూల్చివేస్తుందా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అక్రమ కట్టడాలపై సీఎం జగన్ సీరియస్‌గా అధికారులకు వార్నింగ్ ఇచ్చారు. దీంతో అధికారులు ఉన్నపళంగా చర్యలు చేపట్టారు. మరి ఇప్పుడు చంద్రబాబు ఉంటున్న ఇంటిని కూడా కూల్చివేస్తారనే ప్రచారం జరుగుతోంది.