నేడు హైదరాబాద్‌కు సీఎం జగన్
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు హైదరాబాద్‌కు రానున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం కేసీఆర్‌తో జగన్ ప్రగతిభవన్‌లో భేటీ కానున్నారు. ఈ భేటీలో రెండు రాష్ట్రాలకు సంబంధించిన జలవివాదాలపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించనున్నారు. అలాగే విద్యుత్ ఉద్యోగుల విభజన, షెడ్యూల్ 9,10 ఆస్తుల పంపిణీ.. ఆర్థిక అంశాలు, కోర్టులు, ట్రిబ్యునల్ కేసులను వెలుపల పరిష్కరించుకునే అంశంపై వారిద్దరు చర్చించుకోనున్నారు. ప్రాథమిక దశలో ఇరువురు సీఎంల సమావేశం తరువాత జూలై 3న ఇరు రాష్ట్రాల […]

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు హైదరాబాద్‌కు రానున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం కేసీఆర్‌తో జగన్ ప్రగతిభవన్‌లో భేటీ కానున్నారు. ఈ భేటీలో రెండు రాష్ట్రాలకు సంబంధించిన జలవివాదాలపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించనున్నారు. అలాగే విద్యుత్ ఉద్యోగుల విభజన, షెడ్యూల్ 9,10 ఆస్తుల పంపిణీ.. ఆర్థిక అంశాలు, కోర్టులు, ట్రిబ్యునల్ కేసులను వెలుపల పరిష్కరించుకునే అంశంపై వారిద్దరు చర్చించుకోనున్నారు. ప్రాథమిక దశలో ఇరువురు సీఎంల సమావేశం తరువాత జూలై 3న ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు మరోమారు హైదరాబాద్‌లో భేటీ కానున్నారు.