సౌదీ అరేబియాకు ఇండియా తీవ్ర నిరసన,

సౌదీ అరేబియా తమ దేశ బ్యాంకు నోట్ పై భారత సరిహద్దులను తప్పుడుగా చూపినందుకు ఆ దేశానికి ఇండియా తీవ్ర నిరసన తెలిపింది. ఈ నోట్ లో ఇండియా నుంచి జమ్మూ కాశ్మీర్, లడాఖ్ భూభాగాలను

సౌదీ అరేబియాకు ఇండియా తీవ్ర నిరసన,
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Oct 29, 2020 | 9:21 PM

సౌదీ అరేబియా తమ దేశ బ్యాంకు నోట్ పై భారత సరిహద్దులను తప్పుడుగా చూపినందుకు ఆ దేశానికి ఇండియా తీవ్ర నిరసన తెలిపింది. ఈ నోట్ లో ఇండియా నుంచి జమ్మూ కాశ్మీర్, లడాఖ్ భూభాగాలను వేరు చేసి చూపారని, దాదాపు తొలగించారని విదేశాంగ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. నిజానికి ఇవి ముమ్మాటికీ భారత అంతర్భాగాలని స్పష్టం చేసింది. ఈ నోట్ ని సౌదీ అరేబియన్ మానిటరీ అథారిటీ ఈ నెల 24 న విడుదల చేసింది. దీన్ని వెంటనే సరిదిద్దాలని సౌదీని కోరినట్టు విదేశ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. అయితే ఈ నోట్ లో పీఓకే,  బల్టిస్థాన్ భూభాగాలు మొదట పాక్ కు చెందినవని మ్యాప్ లో చూపి, ఆ తరువాత తొలగించినట్టు కూడా వార్తలు వచ్చాయి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu