నిలకడగా కపిల్ దేవ్ ఆరోగ్యం..!

టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్‌ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, కోలుకుంటున్నారని మాజీ క్రికెటర్‌ చేతన్‌ శర్మ వెల్లడించారు.

నిలకడగా కపిల్ దేవ్ ఆరోగ్యం..!
Follow us

|

Updated on: Oct 24, 2020 | 12:41 PM

టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్‌ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, కోలుకుంటున్నారని మాజీ క్రికెటర్‌ చేతన్‌ శర్మ వెల్లడించారు. ఆస్పత్రిలో కపిల్‌.. తన కూతురు ఆమ్యాతో కలిసి దిగిన ఫొటోను ట్విటర్‌లో పోస్టు చేసిన ఆయన ఈ విషయాన్ని చెప్పారు. అంతకుముందు కపిల్‌ కూడా తన ట్విటర్‌లో క్షేమంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా తన ఆరోగ్యం పట్ల ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు. అయితే, తనపై ప్రేమ చూపించిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు కపిల్ దేవ్. త్వరలోనే పూర్తిగా కోలుకుంటానన్నారు.

కాగా, టీమిండియా క్రికెట్ దిగ్గజం కపిల్‌దేవ్‌ గుండెపోటుతో శుక్రవారం ఆసుపత్రిలో చేరారు. 61 ఏళ్ల కపిల్‌ ఢిల్లీలోని ఫోర్టిస్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. ఆయన ఆరోగ్యంపై వార్తలు రాగానే ఒక్కసారిగా ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు.

ఇదిలా ఉంటే, 1983 చరిత్రాత్మక వన్డే వరల్డ్ కప్‌ సాధించిన భారత జట్టుకు కపిల్ కెప్టెన్. ఆ సిరీస్‌లో తన ఆల్‌రౌండర్ ప్రదర్శనతో టీమిండియాకు చిరస్మరణీయమైన విజయాన్ని అందించారు. బ్యాటింగ్, బౌలింగ్‌లో కపిల్ ఆకట్టుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో మొత్తం 131 టెస్టులు, 225 వన్డేలు ఆడిన కపిల్… 9,000కు పైగా పరుగులు చేశారు. అంతేగాక టెస్టుల్లో 400 వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్‌గా కూడా రికార్డు సాధించారు.