AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

7.8 శాతం జీడీపీ వృద్ధి.. ప్రధాని మోదీ నిర్ణయాత్మక విధానాలతోనే సాధ్యమైంది: కిషన్ రెడ్డి

2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారత్‌ GDP వృద్ధి 7.8 శాతంగా నమోదైంది. ప్రపంచ అనిశ్చితులు, చమురు ధరల ఒడిదుడుకుల మధ్య ఈ వృద్ధి సాధించడం ఆర్థిక వ్యవస్థ బలానికి నిదర్శనమని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. వ్యవసాయం 3.6 శాతం, సెకండరీ సెక్టార్‌ 8.6 శాతం, సర్వీసెస్‌ 10 శాతం వృద్ధి సాధించాయని తెలిపారు.

7.8 శాతం జీడీపీ వృద్ధి.. ప్రధాని మోదీ నిర్ణయాత్మక విధానాలతోనే సాధ్యమైంది: కిషన్ రెడ్డి
Kishan Reddy
SN Pasha
|

Updated on: Aug 31, 2026 | 7:45 PM

Share

ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ భారత్‌ ఆర్థిక వ్యవస్థ వేగంగా ముందుకు సాగుతోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశ వాస్తవ జీడీపీ (GDP) 7.8 శాతం వృద్ధి నమోదు చేయడం ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వానికి, దేశ ఆర్థిక వ్యవస్థ బలానికి నిదర్శనమని పేర్కొన్నారు.

6.9 శాతం నుంచి 7.8 శాతానికి

2025-26 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో నమోదైన 6.9 శాతం వృద్ధితో పోలిస్తే, 2026-27 తొలి త్రైమాసికంలో GDP వృద్ధి 7.8 శాతానికి పెరిగిందని కిషన్‌రెడ్డి తెలిపారు. అంతర్జాతీయ అనిశ్చితులు, చమురు ధరల ఒడిదుడుకులు, సరఫరా వ్యవస్థలో అంతరాయాలు ఉన్నప్పటికీ భారత్‌ ఈ స్థాయి వృద్ధిని సాధించడం కీలక పరిణామమని అన్నారు. తొలి త్రైమాసికంలో 7.8 శాతం వృద్ధి సాధించడం గొప్ప విజయమని, ఇది ప్రధాని మోదీ నిర్ణయాత్మక విధానాలపై ఏర్పడిన విశ్వాసాన్ని ప్రతిబింబిస్తోందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

కీలక రంగాల్లోనూ వృద్ధి

దేశ ఆర్థిక వృద్ధి ఒక్క రంగానికే పరిమితం కాలేదని మంత్రి తెలిపారు. వ్యవసాయం, అనుబంధ రంగాలు 3.6 శాతం వృద్ధిని నమోదు చేయగా, సెకండరీ సెక్టార్‌ ఏకంగా 8.6 శాతం వృద్ధి సాధించిందన్నారు. సర్వీసెస్‌ రంగం 10 శాతం వృద్ధితో మరింత ముందంజలో ఉందని తెలిపారు. ముఖ్యంగా ఫైనాన్షియల్‌, రియల్‌ ఎస్టేట్‌, ఐటీ, ప్రొఫెషనల్‌ సర్వీసెస్‌ రంగాలు 12.1 శాతం వృద్ధిని నమోదు చేయడం సేవల రంగానికి ఊతమిచ్చిందని చెప్పారు.

వ్యవసాయ రంగంపై ప్రత్యేక ప్రశంసలు

ఎల్‌నినో ప్రభావం సహా ప్రతికూల వాతావరణ పరిస్థితుల మధ్య కూడా వ్యవసాయ రంగం 3.6 శాతం వృద్ధిని సాధించడం సానుకూల పరిణామమని కిషన్‌రెడ్డి అన్నారు. సాగు కార్యకలాపాలు, విత్తనాల వేయడం వంటి ప్రక్రియలు కొనసాగుతున్న నేపథ్యంలో రెండో, మూడో త్రైమాసికాల్లో వ్యవసాయ రంగం మరింత మెరుగైన పనితీరు కనబరిచే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.

విమర్శకులకు GDP గణాంకాలే సమాధానం

మౌలిక వసతులు, తయారీ, వ్యవసాయం, సేవలు, పెట్టుబడులు, డిజిటలైజేషన్‌, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌పై కేంద్ర ప్రభుత్వం పెట్టిన దృష్టి ఫలితంగానే ఆర్థిక వ్యవస్థ బలపడుతోందని మంత్రి అన్నారు. భారత్‌ పురోగతిని విమర్శించే వారికి తాజా GDP గణాంకాలు సమాధానమని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రాజకీయ కథనాల కంటే గణాంకాలు బలంగా మాట్లాడతాయి అని పేర్కొంటూ, దేశ ఆర్థిక పురోగతిని తక్కువ చేసి చూపించే ప్రయత్నాలకు 7.8 శాతం వృద్ధి తగిన సమాధానమని అన్నారు.

వికసిత్‌ భారత్‌ లక్ష్యంపై విశ్వాసం

దేశీయ డిమాండ్‌, మౌలిక వసతుల అభివృద్ధి, సంస్కరణలు, వ్యవసాయ రంగం మెరుగైన పనితీరు కొనసాగితే భారత్‌ అధిక వృద్ధి బాటలోనే కొనసాగుతుందని కిషన్‌రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. 7.8 శాతం వృద్ధి ఒక్క త్రైమాసిక విజయమే కాదని, 2047 నాటికి వికసిత్‌ భారత్‌ సాధించాలన్న ప్రధాని మోదీ లక్ష్యానికి ఇది మరో కీలక అడుగు అని పేర్కొన్నారు.

Follow Us
7.8 శాతం జీడీపీ వృద్ధి.. ప్రధాని మోదీ విధానాలతోనే సాధ్యమైంది!
7.8 శాతం జీడీపీ వృద్ధి.. ప్రధాని మోదీ విధానాలతోనే సాధ్యమైంది!
32 మంది ప్రయాణికులతో వస్తున్న విమానానికి బాంబ్ బెదిరింపు
32 మంది ప్రయాణికులతో వస్తున్న విమానానికి బాంబ్ బెదిరింపు
పులుల సంరక్షణకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మరింత బలమైన రక్షణ
పులుల సంరక్షణకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మరింత బలమైన రక్షణ
ఈ టాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా? బర్త్‌డే ఫొటోస్ వైరల్
ఈ టాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా? బర్త్‌డే ఫొటోస్ వైరల్
10వ తరగతి పాసైతే చాలు.. ఇండియా పోస్ట్‌లో 23,757 ఉద్యోగాలు! లింక్
10వ తరగతి పాసైతే చాలు.. ఇండియా పోస్ట్‌లో 23,757 ఉద్యోగాలు! లింక్
అరెరే వాట్సాప్ కాల్ రికార్డ్ చేయడం ఇంత సింపులా? ఇన్నాళ్లు తెలీదే
అరెరే వాట్సాప్ కాల్ రికార్డ్ చేయడం ఇంత సింపులా? ఇన్నాళ్లు తెలీదే
ఆ దెబ్బకు 3 నెలలు ఇంట్లో నుంచి బయటకు రాలేదు
ఆ దెబ్బకు 3 నెలలు ఇంట్లో నుంచి బయటకు రాలేదు
గురువు అనుగ్రహం.. ఆ రాశుల వారికి ప్రతి పనిలో సక్సెస్..!
గురువు అనుగ్రహం.. ఆ రాశుల వారికి ప్రతి పనిలో సక్సెస్..!
అంతులేని విషాదం..! పాపం పసివాడు..తల్లిదండ్రుల ఆచూకీ కోసం.. .
అంతులేని విషాదం..! పాపం పసివాడు..తల్లిదండ్రుల ఆచూకీ కోసం.. .
రష్మికను వదిన అని పిలవను.. ఆసక్తికర విషయం చెప్పిన ఆనంద్ దేవరకొండ
రష్మికను వదిన అని పిలవను.. ఆసక్తికర విషయం చెప్పిన ఆనంద్ దేవరకొండ