Jupiter Blessings: గురువు అనుగ్రహం.. ఆ రాశుల వారికి ప్రతి పనిలో సక్సెస్..!
జ్యోతిషశాస్త్రంలో గురు గ్రహాన్ని శుభఫలితాలు, మార్గదర్శకత్వానికి ప్రతీకగా భావిస్తారు. కొన్ని రాశుల వారికి గురువు అనుకూలంగా ఉండటం వల్ల వారు గురువును స్మరించుకుని ఏదైనా కోరిక, ఆశయం లేదా లక్ష్యంతో ప్రయత్నాలు ప్రారంభిస్తే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. మేషం, మిథునం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకరం, మీన రాశుల వారికి గురు గ్రహం కర్కాటకంలో ఉచ్ఛస్థితిలో ఉండే కాలం అనుకూలంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

Jupiter Blessings
జ్యోతిషశాస్త్రంలో గురు గ్రహాన్ని ఒక దిక్సూచిగా కూడా పరిగణిస్తారు. మీరు చేపట్టే ప్రయత్నానికి గురువు తప్పకుండా సహకరిస్తాడని ఈ శాస్త్రం చెబుతోంది. కొన్ని రాశులవారు గురువును స్మరించుకుని పని గానీ, ప్రయత్నం గానీ చేపడితే అది తప్పకుండా ఫలిస్తుంది. మేషం, మిథునం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకరం, మీన రాశుల వారికి గురువు అక్టోబర్ 31 వరకు, ఆ తర్వాత జనవరి 25 నుంచి జూలై మొదటి వారం వరకు కర్కాటక రాశిలో ఉచ్ఛ స్థితిలో బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఏదో ఒక కోరికతో, ఆశయంతో, ఆకాంక్షతో గురువును ప్రార్థించి ప్రయత్నం చేపట్టడం వల్ల తప్పకుండా లాభం కలుగుతుందని జ్యోతిషశాస్త్రం చెబుతోంది.
- మేషం: దైవానుగ్రహానికి సంబంధించిన గురు గ్రహం చతుర్థ స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉన్నందువల్ల విద్యార్థులు చదువుల్లోనూ, ఉద్యోగార్థులు ప్రభుత్వ ఉన్నతోద్యోగాలకు సంబంధించిన పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూల విషయంలో గట్టి ప్రయత్నాలు సాగించడం మంచిది. గురువు అనుగ్రహం వల్ల తప్పకుండా ఘన విజయాలు సాగించే అవకాశం ఉంది. ఆస్తిపాస్తులు, గృహ, వాహనాలకు ప్రయత్నించడం వల్ల లబ్ధి పొందుతారు. ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారం అవుతుంది.
- మిథునం: ఈ రాశివారికి ధన స్థానంలో గురువు ఉచ్ఛ స్థితిలో ఉండడం వల్ల ఆదాయ వృద్ధికి, ఆస్తి లాభా నికి, సొంత గృహానికి ప్రయత్నాలు సాగించడం చాలా మంచిది. గురువు అనుగ్రహం వల్ల వీరి కోరిక తప్పకుండా నెరవేరుతుంది. వృత్తి, ఉద్యోగాల మీద శ్రద్ధ పెట్టడం, నైపుణ్యాలను పెంచుకో వడం వల్ల వీరు శీఘ్రపురోగతి చెందే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీల మీద పెట్టుబడులు పెట్టడం వల్ల లాభపడతారు. కుటుంబ జీవితం బాగా మెరుగుపడుతుంది.
- కర్కాటకం: ఈ రాశిలో గురువు ఉచ్ఛ స్థితిలో ఉన్నందువల్ల వీరికి అపారంగా దైవానుగ్రహం కలిగే అవకాశం ఉంది. జీవితంలో ఆశించిన విధంగా తమ రంగంలో పురోగతి చెందడానికి వీరికి అనేక అవకాశాలు లభిస్తాయి. గురువును స్మరించి వీటిని సద్వినియోగం చేసుకోవడం మంచిది. మంచి పరిచ యాలు కలుగుతాయి. రాజకీయ ప్రాబల్యం పెరుగుతుంది. అధికార యోగం పడుతుంది. సొంత ఇంటి కల, విదేశాల్లో ఉద్యోగం చేయాలన్న కల నెరవేరుతాయి. సంపద బాగా వృద్ది చెందుతుంది.
- కన్య: ఈ రాశికి లాభ స్థానంలో గురువు ఉచ్ఛస్థితిలో ఉన్నందువల్ల గురువు అనుగ్రహంతో ఈ రాశికి ఆర్థికపరంగా అనేక లాభాలు కలగడంతో పాటు ఏ రంగంలో ఉన్నా ఉన్నత స్థితికి వెళ్లే అవకాశం కలుగుతుంది. ఎంత ప్రయత్నిస్తే గురువు నుంచి అంత తోడ్పాటు లభిస్తుంది. మనసులోని కోరి కలు, ఆశలు, ఆకాంక్షలు చాలావరకు నెరవేరుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో ఘన విజయాలు సాధిస్తారు.
- వృశ్చికం: ఈ రాశికి భాగ్య స్థానంలో గురువు ఉచ్ఛస్థితిలో ఉన్నందువల్ల గురువు అనుగ్రహం వల్ల పట్టిం దల్లా బంగారం అవుతుంది. కొద్ది ప్రయత్నంతో వీరి దశ, దిశ మారిపోవడం జరుగుతుంది. ఆస్తి సమస్యలు, కోర్టు కేసులు బాగా అనుకూలంగా పరిష్కారమవుతాయి. గురువును ప్రార్థించి ప్రయ త్నాలు చేపట్టడం వల్ల వీరికి అనేక రకాల అదృష్టాలు కలుగుతాయి. వీరు ఎంత సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే అంత మంచిది. వివిధ మార్గాల్లో ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.
- మకరం: ఈ రాశికి సప్తమ స్థానంలో గురువు ఉచ్ఛస్థితిలో సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారు అతి కొద్ది ప్రయత్నంతో అత్యధికంగా లబ్ధి పొందే అవకాశం ఉంది. కొద్ది ప్రయత్నంతో, గురువు అను గ్రహంతో వీరికి అనేక విధాలుగా అదృష్టాలు పడతాయి. విదేశీ ప్రయత్నాల్లో సక్సెస్ అవుతారు. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడంగానీ, పెళ్లి కావడం గానీ జరుగుతుంది.. వైవాహిక సమస్యలు తొలగిపోతాయి. ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. సంతాన ప్రాప్తి కలుగుతుంది.
- మీనం: ఈ రాశికి అధిపతి అయిన గురువు పంచమ స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉన్నందువల్ల వీరికి కొద్ది ప్రార్థనతో గురువు అనుగ్రహం అపారంగా కలిగే అవకాశం ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజ యం సిద్ధిస్తుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటి అదనపు ఆదాయ ప్రయత్నాలు నూరు శాతం ఫలి స్తాయి. ఇంట్లో పెళ్లి, గృహప్రవేశం వంటి శుభకార్యాలు జరుగుతాయి. సంతాన ప్రాప్తి కలుగుతుంది. విదేశీ ఉద్యోగాలు లభిస్తాయి. రాజపూజ్యాలు కలుగుతాయి. తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి
Follow Us



