AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Washing Machine Tips: వాషింగ్ మెషిన్‌లో కంఫర్ట్‌ ఎప్పుడు వేయాలో తెలుసా? చాలా మంది చేసే పొరపాటు ఇదే!

Washing Machine Tips: ఈ సరైన సమయాల్లో కంఫర్ట్‌ను వేయడం వల్ల బట్టలకు అది సమర్థవంతంగా అప్లై అవుతుంది. దీని ద్వారా బట్టలు మరింత మృదువుగా మారి, మీరు ఆశించిన మంచి సువాసన ఎక్కువసేపు నిలిచి ఉంటుంది. వాషింగ్ మెషీన్ రకాన్ని బట్టి సరైన పద్ధతిని పాటించడం వల్ల దుస్తులు తాజాగా, మంచి సువాసనతో ఉంటాయి..

Washing Machine Tips: వాషింగ్ మెషిన్‌లో కంఫర్ట్‌ ఎప్పుడు వేయాలో తెలుసా? చాలా మంది చేసే పొరపాటు ఇదే!
Washing Machine Tips
Subhash Goud
|

Updated on: Sep 20, 2026 | 11:36 AM

Share

Washing Machine Tips: బట్టలు ఉతికిన తర్వాత మంచి సువాసన రావడానికి, మృదువుగా ఉండటానికి మనం తరచుగా ఫ్యాబ్రిక్ కండిషనర్‌లను, ముఖ్యంగా కంఫర్ట్ వంటి ఉత్పత్తులను ఉపయోగిస్తాం. అయితే, చాలామంది చేసే ఒక సాధారణ తప్పు ఏమిటంటే, డిటర్జెంట్‌తో పాటే కంఫర్ట్‌ను కూడా వాషింగ్ మెషీన్‌లో వేయడం. ఈ విధానం బట్టలకు సరిగా పట్టకుండా చేస్తుంది. సరైన ఫలితాల కోసం వాషింగ్ మెషీన్ రకాన్ని బట్టి కంఫర్ట్ వేసే సమయం మారుతుందంటున్నారు నిపుణులు.

టాప్ లోడ్ వాషింగ్ మెషీన్‌లలో బట్టలు రిన్స్ సైకిల్‌లోకి వెళ్ళినప్పుడు సాధారణంగా ఒక బీప్ సౌండ్ వస్తుంది. ఆ సమయంలో మెషీన్ డోర్ తెరిచి కంఫర్ట్‌ను వేయాలి. ఇలా చేయడం వల్ల అది బట్టలకు పూర్తిగా పట్టి, సువాసన బాగా నిలుస్తుంది. ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్‌ల విషయంలో, కంఫర్ట్‌ను వాషింగ్ ప్రారంభంలోనే లేదా రిన్స్ సైకిల్ సమయంలో వేయడం ఉత్తమం. కొన్ని మెషీన్‌లలో దీనికి ప్రత్యేక కంపార్ట్‌మెంట్ కూడా ఉంటుంది.

ఇది కూడా చదవండి: Washing Machine: వాషింగ్ మెషిన్ కొనేస్తే సరిపోదు.. ఈ ఖర్చులు ఉంటాయని మీకు తెలుసా?

ఈ సరైన సమయాల్లో కంఫర్ట్‌ను వేయడం వల్ల బట్టలకు అది సమర్థవంతంగా అప్లై అవుతుంది. దీని ద్వారా బట్టలు మరింత మృదువుగా మారి, మీరు ఆశించిన మంచి సువాసన ఎక్కువసేపు నిలిచి ఉంటుంది. వాషింగ్ మెషీన్ రకాన్ని బట్టి సరైన పద్ధతిని పాటించడం వల్ల దుస్తులు తాజాగా, మంచి సువాసనతో ఉంటాయి.

మరింత మెరుగైన ఫలితాల కోసం అదనపు చిట్కాలు:

  1. నేరుగా బట్టలపై పోయకూడదు: కంఫర్ట్‌ను ఎప్పుడూ పొడి లేదా తడి బట్టలపై నేరుగా పోయకూడదు. అలా చేస్తే బట్టలపై మరకలు పడే అవకాశం ఉంది. ఎప్పుడైనా నీళ్లలో కలిపి మాత్రమే వాడాలి.
  2. మోతాదు ముఖ్యం: ఎక్కువగా వాడితే బట్టలు మరింత సువాసన వస్తాయని భావించడం పొరపాటు. పరిమితికి మించి వాడితే బట్టల దారాల మధ్య కండిషనర్ పొరలా పేరుకుపోయి, బట్టలు చెమటను పీల్చుకునే శక్తిని కోల్పోతాయి. క్యాప్‌పై ఉన్న కొలత (0.5 Cap నుండి 1 Cap) ప్రకారం మాత్రమే వాడాలంటున్నారు టెక్నీషియన్స్‌.

ఇది కూడా చదవండి: Compound Walls: ప్రహరీ గోడ కడుతున్నారా? ఈ చిన్న పొరపాటు చేస్తే గోడ బీటలు వారడం ఖాయం!

ఏ దుస్తులకు వాడకూడదు?:

  • స్పోర్ట్స్ వేర్ / జిమ్ దుస్తులు: ఇవి చెమటను పీల్చేలా రూపొందుతాయి. కండిషనర్ వాడితే వీటి ఫాబ్రిక్ దెబ్బతింటుంది.
  • మైక్రోఫైబర్ టవళ్లు: టవళ్ల నీటిని పీల్చే గుణాన్ని కండిషనర్ తగ్గిస్తుంది.
  • బేబీ వేర్, వాటర్ ప్రూఫ్ దుస్తులు: చిన్నపిల్లల దుస్తులు, నైలాన్/వాటర్ ప్రూఫ్ కోట్లకు కండిషనర్లు వాడకపోవడమే మంచిది.
  • డ్రాయర్ శుభ్రత: ఫ్రంట్ లోడ్ మెషీన్లలో కంఫర్ట్ వేసే డిస్పెన్సర్ బాక్స్‌ను నెలకు ఒకసారైనా వేడి నీళ్లతో క్లీన్ చేయాలి. లేదంటే అక్కడ జిడ్డులా పేరుకుపోయి బ్యాక్టీరియా చేరే ప్రమాదం ఉంది.
  • ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం వల్ల దుస్తులు పాడవకుండా ఉండటమే కాకుండా, ఎక్కువ కాలం కొత్తవిగా, రోజంతా మంచి సువాసనతో ఉంటాయి.

ఇవి కూడా చదవండి:

Gold Price Today: పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ ఆకాశాన్ని తాకుతున్న ధరలు..!

Heat Solutions Heat: రేకుల షెడ్డులో వేడితో తట్టుకోలేకపోతున్నారా? ఇలా చేస్తే ఏసీలాంటి కూలింగ్‌..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us