చాణక్య నీతి : చెడు రోజులు ప్రారంభం అయినప్పుడు చేయాల్సిన పనులివే

Samatha

20 september 2026

Pic credit - Pinterest

అన్నీ మంచి రోజులు అని చెప్పలేం. కొన్ని సార్లు కష్టకాలం కూడా ప్రారంభం అవుతుంది. అలాంటి సమయంలో ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

మంచి రోజులు

అయితే ఆ సమయంలో మీరు ఏ పని చేసినా ప్రతీ పని మీకు తప్పుగా జరుగుతున్నట్లు కూడా అనిపిస్తుందా? అయితే మీకు అదృష్టం కలిసిరావడం లేదు అని అర్థం.

లక్కు

ఈ సమయంలో చాణక్యుడు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించాడు.  మీరు జీవితంలో ఎంత కష్టపడి పని చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా అది మీకు తప్పు అనిపిస్తుందా?

చాణక్యుడు

అయితే నిరుత్సాహ పడకుండా  ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలంట. చాణక్యుడి ప్రకారం, అస్సలే తొందరపడకుండా చాలా ఓపికా ఉండాలి. ఏదీ శాశ్వతం కాదు అని గుర్తుపెట్టుకోవాలి.

నిరుత్సాహ పడకుండా

చాలా మంది అదృష్టం మీదనే బతుకుతారు. కానీ అదృష్టం మీద కాకుండా, కష్టపడి పని చేస్తూ ఉండాలి. అప్పుడే మీకు లక్కు అనేది కలిసి వస్తుందని చెబుతున్నాడు చాణక్యుడు.

అదృష్టం

తొందరపడి లేదా కోపంతో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. దీని వలన మీరే ఎక్కువగా నష్టపోవాల్సి వస్తుందని గుర్తుంచుకోవాలి.

కోపంతో నిర్ణయాలు

అంతే కాకుండా మీ తప్పుల నుంచి మీరు నేర్చుకోవాలి. తప్పు ఎక్కడ జరిగిందో దానిపై దృష్టి పెట్టడం చాలా మంచిదని చెబుతున్నాడు ఆ చార్య చాణక్యుడు.

తప్పులు

చాలా మంది కష్టంలో ఉన్న సమయంలో ఎగతాళి చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ అలా ఎప్పుడూ చేయకూడదు అని చెబుతున్నాడు ఆ చార్య చాణక్యుడు.

కష్టకాలం