రోజుకు ఒక జామ పండు.. వీరికి ఇదొక వరం

Samatha

20 september 2026

Pic credit - Pinterest

జామ పండు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది చాలా తక్కువ ధరల సులభంగా దొరుకుతుంది. అంతే కాకుండా శరీరానికి చాలా మేలు చేస్తుంది.

జామ పండు

కానీ కొంత  మంది దీనిని తినడానికి అస్సలే ఆసక్తి చూపరు. కానీ ప్రతి రోజూ ఒక జామ పండు తినడం వలన బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంట.

ఆరోగ్య ప్రయోజనాలు

ప్రతి రోజూ జామ పండు తినడం వలన ఇది జీర్ణక్రియ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. జీర్ణక్రియ సాఫీగా సాగేలా చేస్తుంది.

జీర్ణక్రియ

అంతే కాకుండా బీపీ, గుండె జబ్బులు ఉన్నవారికి కూడా ఇది చాలా మంచిది. జామ పండులో పొటాషియం, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అందువలన ఇది గుండెకు మేలు చేస్తుంది.

బీపీ, గుండె జబ్బులు

తీసుకుంటున్న ఆహారం జీవనశైలి కారణంగా ఈ మధ్య కాలంలో చాలా మంది మలబద్ధకం గ్యాస్ సమస్యలతో బాధపడుతున్నారు.

మలబద్ధకం, గ్యాస్

జామ పండులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అందువలన ప్రతి రోజూ ఒక జామ పండు తినడం వలన ఇది మలబద్ధకం, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యల నుంచి త్వరగా ఉపశమనం అందిస్తుంది.

ఫైబర్ పుష్కలం

ముఖ్యంగా షుగర్ పేషెంట్స్‌కు జామ పండు చాలా మంచిది. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన దీనిని తినడం వలన షుగర్ ఎక్కువగా పెరగకుండా ఉంటుంది.

షుగర్ పేషెంట్స్

అంతే కాకుండా ప్రతి రోజూ ఒక పండు తినడం వలన ఇది రోగనిరోధక శక్తిని పెంచి, శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తుంది.

ఇమ్యూనిటీ