మటన్ వీరికి విషంతో సమానం తింటే అనేక రోగాలే!

Samatha

20 september 2026

Pic credit - Pinterest

నాన్ వెజ్ అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు. ప్రతి ఒక్కరూ చాలా ఇష్టం నాన్ వెజ్ తింటారు. ముఖ్యంగా చాలా మందికి మటన్ అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది.

నాన్ వెజ్

అయితే మటన్ ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ, కొంత మంది దీనిని తినడం అస్సలే మంచిది కాదు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

మటన్

గుండె సమస్యలు ఉన్నవారికి మటన్ అస్సలే మంచిది కాదు. అందువలన వీరు దీనికి ఎంత దూరం ఉంటే అంత మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

గుండె సమస్యలు

అలాగే కిడ్నీ, లివర్ సమస్యలతో బాధపడే వారు కూడా అస్సలే మటన్ తినకూడదంట. దీని వలన క్రియాటినిన్ విపరీతంగా పెరిగి, కిడ్నీ దెబ్బతినే ఛాన్స్ ఉంది.

కిడ్నీ, లివర్

అంతే కాకుండా మటన్‌లో ఫ్యూరిన్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందువలన దీనిని ఎవరు అయితే తింటారో వారికి యూరిక్ యాసిడ్ పెరిగి, కీళ్ల నొప్పుల వంటి సమస్యలు వస్తాయి.

కీళ్ల నొప్పులు

అలాగే అధిక బరువుతో బాధపడే వారు కూడా చాలా వరకు మటన్ తక్కువగా తినడం లేదా మొత్తానికే తినకపోవడం మంచిది. లేకపోతే వేగంగా బరువు పెరిగే ఛాన్స్ ఉన్నదంట.

అధిక బరువు

అలాగే గర్భిణీలు కూడా మటన్ ఎక్కువగా తినకపోవడమే మంచిది. లేకపోతే ఇది జీర్ణసమస్యలు, గర్భస్రావం వంటి సమస్యలకు కారణం అయ్యే ఛాన్స్ ఉన్నదంట.

గర్భిణీలు

అలాగే శరీరం ఎప్పుడూ చాలా వేడిగా ఉండే వారు, చిన్న పిల్లలు కూడా వీలైనంత వరకు మటన్ తినకపోవడమే మంచిది అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

వేడి శరీరం