కరోనా అప్‌డేట్ : దేశంలో కొత్తగా 44,059 పాజిటివ్ కేసులు, ఊరటనిస్తోన్న రికవరీ రేటు

దేశంలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో మరో 44,059 వైరస్‌ కేసులు వెలుగుచూశాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 91,39,866కు పెరిగింది.

కరోనా అప్‌డేట్ : దేశంలో కొత్తగా 44,059 పాజిటివ్ కేసులు, ఊరటనిస్తోన్న రికవరీ రేటు
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 23, 2020 | 10:49 AM

దేశంలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో మరో 44,059 వైరస్‌ కేసులు వెలుగుచూశాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 91,39,866కు పెరిగింది. ఇక గత 24 గంటల్లో మరో 511 మంది కోవిడ్ కారణంగా చనిపోయారు. దీంతో దేశంలో మొత్తం కోవిడ్‌ మృతుల సంఖ్య 1,33,738 చేరింది. ఇదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో 41,024 మంది కొవిడ్‌ నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు మొత్తం కోలుకున్నవారి సంఖ్య 85,62,641కు చేరింది. దేశంలో ప్రస్తుతం 4,43,486 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.   ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 93.68శాతంగా ఉండగా..డెత్ రేటు 1.46శాతంగా ఉంది. ఆదివారం మొత్తం 8,49,596 పరీక్షలు నిర్వహించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో ఇప్పటి వరకు చేపట్టిన మొత్తం టెస్టుల సంఖ్య 13,25,82,730కి చేరింది.

ఢిల్లీలో ఆగని విజృంభన

ఇక దేశ రాజధాని ఢిల్లీలో కరోనా విజృంభన కొనసాగుతోంది. ఆదివారం కొత్తగా 6,746 వైరస్‌ కేసులు వెలుగు చూడగా.. ఢిల్లీలో మొత్తం కేసుల సంఖ్య 5,29,863కు చేరింది. ఆదివారం మరో 121 మంది వైరస్‌కు బలయ్యారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 8,391కు పెరిగింది.

Also Read :

తీవ్ర విషాదం, కరోనాతో మహాత్మా గాంధీ మునిమనవడు సతీశ్​ ధుపేలియా మృతి

గ్రేటర్ ఎన్నికల వేళ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఇంట తీవ్ర విషాదం, మేనల్లుడు ఆత్మహత్య

ఆ ప్రభుత్వ ఉద్యోగుల నివాసాలు అక్కడే ఉండాలి, జగన్ సర్కార్ కీలక ఆదేశాలు