సోషల్‌ మీడియాలో న్యాయమూర్తులపై అనుచిత పోస్టులు, సీబీఐ స్పెషల్ ఫోకస్

సోషల్‌ మీడియాలో పోస్టులపై ఫోకస్‌ పెట్టారు సీబీఐ అధికారులు. ఇటీవల న్యాయమూర్తులపై సోషల్‌ మీడియాలో చేసిన అనుచిత వ్యాఖ్యలపై కేసు నమోదు చేశారు.

సోషల్‌ మీడియాలో న్యాయమూర్తులపై అనుచిత పోస్టులు, సీబీఐ స్పెషల్ ఫోకస్
Follow us

|

Updated on: Nov 23, 2020 | 10:32 AM

సోషల్‌ మీడియాలో పోస్టులపై ఫోకస్‌ పెట్టారు సీబీఐ అధికారులు. ఇటీవల న్యాయమూర్తులపై సోషల్‌ మీడియాలో చేసిన అనుచిత వ్యాఖ్యలపై కేసు నమోదు చేశారు. గతంలో అసభ్యకర పోస్టులపై న్యాయవాది లక్ష్మినారాయణ, సీజేకు లేఖ రాశారు. సోషల్‌ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కేసులో ఇప్పటి వరకు 17 మందిపై ఎఫ్‌ఆర్‌ఆర్‌ నమోదు చేశారు.

సీజేకు లేఖ రాసిన న్యాయవాది లక్ష్మినారాయణను గంటన్నర పాటు విచారించారు సీబీఐ అధికారులు. తన దగ్గర ఉన్న ఆధారాలను సీబీఐ అధికారులకు సమర్పించారు లక్ష్మినారాయణ. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై కోర్టులో విచారణ జరుగుతుండగా కొందరు వాటిని ఉద్దేశించి సోషల్‌ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టారని తెలిపారు లక్ష్మినారాయణ. ఈ కేసులో ఎంపీ విజయసాయితో పాటు, సురేష్, తమ్మినేని, ఎమ్మెల్సీ రవీంద్ర, మంత్రి నారాయణస్వామి, ఆమంచిని సీబీఐ విచారించే అవకాశం ఉంది.

న్యాయమూర్తులపై పెట్టిన పోస్టులను కొందరు ఫేస్‌బుక్‌లో డిలీట్‌ చేశారని చెబుతున్నారు న్యాయవాది లక్ష్మినారాయణ. అయితే పోలీసుల విచారణలో అవన్నీ బయటపడతాయన్నారు. ఈ పోస్టుల వెనుక రాజకీయ పార్టీల హస్తం ఉందా ? లేదా అనేది విచారణలో తేలుతుందన్నారు లక్ష్మినారాయణ.

Also Read :

తీవ్ర విషాదం, కరోనాతో మహాత్మా గాంధీ మునిమనవడు సతీశ్​ ధుపేలియా మృతి

గ్రేటర్ ఎన్నికల వేళ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఇంట తీవ్ర విషాదం, మేనల్లుడు ఆత్మహత్య

ఆ ప్రభుత్వ ఉద్యోగుల నివాసాలు అక్కడే ఉండాలి, జగన్ సర్కార్ కీలక ఆదేశాలు

Latest Articles
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు