నోరూరించే ఆఫర్, రేట్లు మండిపోతున్న సమయంలో రూ.99కే కేజీ చికెన్ !

తమ వ్యాపార వృద్ధి కోసం వ్యాపారులు అనేక ఆఫర్లు పెడుతుంటారు. అందులో డిస్కౌంట్‌ సేల్స్‌ అని, ఒకటి కొంటే మరొకటి ఫ్రీ అని ఆఫర్లు పెట్టి ప్రజలను ఆకట్టుకునేయత్నం చేస్తుంటారు.

నోరూరించే ఆఫర్, రేట్లు మండిపోతున్న సమయంలో రూ.99కే కేజీ చికెన్ !
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 23, 2020 | 10:15 AM

తమ వ్యాపార వృద్ధి కోసం వ్యాపారులు అనేక ఆఫర్లు పెడుతుంటారు. అందులో డిస్కౌంట్‌ సేల్స్‌ అని, ఒకటి కొంటే మరొకటి ఫ్రీ అని ఆఫర్లు పెట్టి ప్రజలను ఆకట్టుకునేయత్నం చేస్తుంటారు. ఆ జాబితాలో ఇప్పుడు చికెన్‌ వ్యాపారులు కూడా చేరారు. అదేంటీ చికెన్‌ రేట్లు బాగానే మండిపోతున్నా కదా.. . ఇప్పుడు ఆఫర్‌ పెట్టాల్సిన అవసరం ఏంటని అనుకుంటున్నారా.. అయితే మీరు ఈ స్టోరీ చదవాల్సిందే.

కరోనా కాలంలో చికెన్‌ వైపు చూసేందుకు భయపడ్డ జనం.. ఆ తర్వాత ఇమ్యూనిటీకి అదే బెస్ట్‌ అని చెప్పడంతో తినేందుకు ఎగబడ్డారు. దాంతో చికెన్‌ రేట్లు ఒక్కసారిగా డబుల్‌ అయ్యాయి. ఆ రేటు చాలా చోట్ల కంటిన్యూ అవుతుండగా.. ఆదిలాబాద్‌ జిల్లాలో మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తోంది. పోటాపోటీగా చికెన్‌ రేట్లను తగ్గిస్తూ అమ్ముతున్నారు ఇక్కడి వ్యాపారులు. నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌లో చికెన్‌ ప్రియులను వ్యాపారస్తులు ఊరిస్తున్నారు. రేట్లను తగ్గిస్తూ చికెన్‌ను పోటాపోటీగా అమ్ముతుండడంతో ప్రజలు కూడా కొనేందుకు ఎగబడుతున్నారు. ఒకరు 99 రూపాయలకే కిలో చికెన్‌ను అమ్ముతుండగా.. మరికొందరు 100, 120, 130 రూపాయలకు అమ్ముతున్నారు. బ్యానర్లు, ఫ్లెక్సీలు పెట్టి మైకులో కిలో చికెన్‌ 99 రూపాయలు మాత్రమే అంటూ ఊదరగొడుతూ ఊరిస్తున్నారు.

కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ఇమ్యూనిటీ కోసం చికెన్‌ తినడం మంచిదని డాక్టర్లు కూడా చెబుతుండడంతో ఇటీవల నాన్ వెజ్ తినేందుకు చాలా మంది ఇంట్రెస్టు చూపుతున్నారు. వారానికి కనీసం రెండురోజులైనా నాన్‌వెజ్‌ తినాలని చూస్తున్నారు. దాంతో కిలో ధర 250రూపాయలకుపైగా పలికిన చికెన్‌ రేటు.. ఇలా ఒక్కసారిగా తగ్గించి అమ్ముతుండడంతో ప్రజలు కూడా తీసుకునేందుకు ఆసక్తి చూపారు. రేట్లను తగ్గించి అమ్ముతుండడంతో.. చికెన్‌ సెంటర్ల ముందు జాతరలా కనిపించింది జనం సందడి.

Also Read :

తీవ్ర విషాదం, కరోనాతో మహాత్మా గాంధీ మునిమనవడు సతీశ్​ ధుపేలియా మృతి

గ్రేటర్ ఎన్నికల వేళ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఇంట తీవ్ర విషాదం, మేనల్లుడు ఆత్మహత్య

ఆ ప్రభుత్వ ఉద్యోగుల నివాసాలు అక్కడే ఉండాలి, జగన్ సర్కార్ కీలక ఆదేశాలు