India Corona Cases: దేశంలో కొత్తగా 43,654 కరోనా కేసులు, యాక్టివ్ కేసులు, మరణాల సంఖ్య ఇలా

Sanjay Kasula

Sanjay Kasula |

Updated on: Jul 28, 2021 | 10:44 AM

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నెమ్మదిగా దిగివస్తోంది.పాజిటివ్ కేసులు, మరణాల్లో రోజూ హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో...

India Corona Cases: దేశంలో కొత్తగా 43,654 కరోనా కేసులు, యాక్టివ్ కేసులు, మరణాల సంఖ్య ఇలా
India Corona

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నెమ్మదిగా దిగివస్తోంది.పాజిటివ్ కేసులు, మరణాల్లో రోజూ హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 17,20,100 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 43,654 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 3,14,84,605కి చేరింది. ఇందులో 3,99,436 యాక్టివ్ కేసులు ఉన్నాయి. నిన్న కొత్తగా 41,678 మంది దేశవ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల నుంచి కోలుకొని డిశ్చార్జ్ కావడంతో.. రికవరీల సంఖ్య 3,06,63,147కి చేరింది.

అటు నిన్న 640 మంది కరోనాతో మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 4,22,022 చేరుకుంది. ఇదిలా ఉంటే ఇప్పటిదాకా 44,61,56,659 కోట్ల వ్యాక్సినేషన్ డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. కాగా, దేశంలో క్రియాశీల రేటు 1.31 శాతానికి చేరిందని.. అలాగే రికవరీ రేటు 97.35 శాతంలో ఉందని పేర్కొంది.

గాలిలో కరోనా వైరస్ పనిపెట్టే లేజర్..

ఏడాదిన్నర కాలంగా కరోనా మహమ్మారి మనల్ని పట్టి పీడిస్తోంది. ఈ వైరస్ అంతుచూడాలని పరిశోధకులు చేయని ప్రయత్నాలు లేవంటే అతిశయోక్తి కాదు. అతి వేగంగా టీకా కనిపెట్టారు. అదేవిధంగా అంతే వేగంతో దీని వ్యాప్తిని అరికట్టే ప్రయత్నాలూ చేస్తోన్నారు. ఎప్పటికప్పుడు కొత్త వైవిధ్యాలు వెలుగులోకి వస్తుండటం పరిశోధకులకు అడ్డంకిగా మారింది. అయినప్పటికీ పట్టువదలకుండా తమ ప్రయత్నాలను చేస్తున్నారు. తాజాగా కరోనా వైరస్ ను చంపగలిగే ఒక పరికరాన్ని ఇటలీలో కనుగొన్నారని చెబుతున్నారు.  ఇది లేజర్ పరికరం. ఈ పరికరం గాలిలోనూ.. గోడమీదా ఉన్న కరోనా వైరస్ పని పడుతుందని పరిశోధకులు అంటున్నారు.

ఈ పరికరాన్ని ఐక్యరాజ్యసమితి శాస్త్రవేత్తలు ఇటాలియన్ టెక్ సంస్థ శాస్త్రవేత్తల సహకారంతో తయారు చేశారు. ఉత్తర ఇటాలియన్ నగరమైన ట్రీస్టేలో ఉన్న ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ జెనెటిక్ ఇంజనీరింగ్ అండ్ బయోటెక్నాలజీ, లేజర్ పరికరాలను తయారుచేసే స్థానిక సంస్థ ఆల్టెక్ కె-లేజర్ గత సంవత్సరం ఇటలీ కోవిడ్ -19 తో పోరాడుతున్నప్పుడు ఈ ప్రయత్నాన్ని ప్రారంభించింది. ఆల్టెక్ సంస్థ స్థాపకుడు ఫ్రాన్సిస్కో జనతా. అతని సంస్థ వైద్య రంగంలో ఉపయోగించే లేజర్ ఉత్పత్తులను తయారు చేస్తుంది.

ఇది కూడా చదవండి: అమ్మో.. పాలు కాదు.. కాలకూట విషం.. కల్తీ మాఫియా గుట్టురట్టు చేసిన ఎస్‌వోటీ పోలీసులు

ఇది కూడా చదవండి: Karnataka New CM: కర్నాటక కొత్త సీఎం బసవరాజ బొమ్మై.. ఇవాళ ప్రమాణస్వీకారం..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu