Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MAA Elections: రోజుకో ట్విస్ట్‌తో ‘మా’ ఎన్నికలు.. రేపు కృష్ణంరాజు అధ్యక్షతన సమావేశం.. ఏకగ్రీవం కోసం మురళీ మోహన్

MAA Elections: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల పై సర్వత్రా చర్చ  జరుగుతుంది. మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ కార్యవర్గం పదవీ కాలం చెల్లింది కనుక వెంటనే..

MAA Elections: రోజుకో ట్విస్ట్‌తో 'మా' ఎన్నికలు.. రేపు కృష్ణంరాజు అధ్యక్షతన సమావేశం.. ఏకగ్రీవం కోసం మురళీ మోహన్
Maa
Follow us
Surya Kala

|

Updated on: Oct 10, 2021 | 6:00 PM

MAA Elections: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల పై సర్వత్రా చర్చ  జరుగుతుంది. మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ కార్యవర్గం పదవీ కాలం చెల్లింది కనుక వెంటనే ఎన్నికలు నిర్వహించాలంటూ కొంతమంది సభ్యులు కోరుతున్నారు ఈ మేరకు వెంటనే ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు కృష్ణంరాజుకు సంఘంలోని ఎగ్జిక్యూటివ్ కమిటీలోని 15 మంది సభ్యులు లేఖ రాశారు.

అయితే మా ఎన్నికలను ఏకగ్రీవం చేయాలనీ కొంతమంది.. ఎన్నికలు పెట్టాలని మరికొందరు వాదిస్తున్నారు. ఈ సారి ‘మా’ అధ్యక్ష పదవి కోసం ఆరుగురు సభ్యులు ఎన్నికల బరిలో నిలిచారు.  మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్స్ ఎలక్షన్స్ ఎప్పుడు జరిగినా సాధారణ ఎన్నికలకు ఏమాత్రం తీసిపోవు.

సీనియర్‌ నరేష్ పదవీ కాలం ముగియడంతో ఫిల్మ్ సర్కిల్స్‌లో మా ఎలక్షన్స్‌పై వాడివేడి చర్చ జరుగుతోంది. లోకల్ నాన్ లోకల్ తెలంగాణ వాదం లు కూడా ఈసారి ఎన్నికల్లో వినిపిస్తున్నాయి. మా భవన నిర్మాణంమళ్ళీ తెరపై వచ్చింది.  ఈ నేపథ్యంలో ‘మా’ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం గురువారం వర్చువల్ పద్దతిలో జరగనుంది. కృష్ణం రాజుకు అందిన లేఖపై ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. రాబోయే ఎన్నికల్లో పోటీ తప్పని పరిస్థితి ఏర్పడింది. అయితే సీనియర్అ నటుడు మురళీ మోహన్సో ఏకగ్రీవం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అసియేషన్ శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని ఏకగ్రీవంగా కమిటి ని ఏర్పాటు చేసేందుకు సీనియర్ నటుడు మురళి మోహన్ చేస్తున్న ప్రయత్నాలు ఏమేరకు ఫలిస్తాయో చూడాలి.

Also Read: World Hepatitis Day: చివరి వరకూ బయటపడకుండా ప్రాణాన్ని హరించే హెపటైటిస్.. ఈ వ్యాధిని గుర్తించడం ఎలా ..