తొలిదశలో పోటీపడుతోన్న హేమాహేమీలు

బీహార్‌లో ఇవాళ జరుగుతోన్న తొలిదశ అసెంబ్లీ ఎన్నికల్లో హేమా హేమీలు పోటీపడుతున్నారు. మొదటి విడత పోలింగ్‌లోనే పలువురు ప్రముఖులు తమ భవితవ్యాన్ని తేల్చుకోనున్నారు. తొలి దశ ఎన్నికల్లో అధికార JDU 35 చోట్ల, మిత్రపక్షం బీజేపీ 29 చోట్ల బరిలో ఉంది. ప్రతిపక్ష RJD 42 చోట్ల, కాంగ్రెస్‌ 20 చోట్ల తమ అభ్యర్థులను నిలిపింది. చిరాగ్‌ పాసవాన్‌ నేతృత్వంలోని LJP-41 చోట్ల పోటీ చేస్తుండగా..అందులో 35 స్థానాల్లో జేడీయూతోనే ప్రధాన పోటీ నెలకొంది. రాజకీయ విభేదాల […]

తొలిదశలో పోటీపడుతోన్న హేమాహేమీలు
Follow us

|

Updated on: Oct 28, 2020 | 1:01 PM

బీహార్‌లో ఇవాళ జరుగుతోన్న తొలిదశ అసెంబ్లీ ఎన్నికల్లో హేమా హేమీలు పోటీపడుతున్నారు. మొదటి విడత పోలింగ్‌లోనే పలువురు ప్రముఖులు తమ భవితవ్యాన్ని తేల్చుకోనున్నారు. తొలి దశ ఎన్నికల్లో అధికార JDU 35 చోట్ల, మిత్రపక్షం బీజేపీ 29 చోట్ల బరిలో ఉంది. ప్రతిపక్ష RJD 42 చోట్ల, కాంగ్రెస్‌ 20 చోట్ల తమ అభ్యర్థులను నిలిపింది. చిరాగ్‌ పాసవాన్‌ నేతృత్వంలోని LJP-41 చోట్ల పోటీ చేస్తుండగా..అందులో 35 స్థానాల్లో జేడీయూతోనే ప్రధాన పోటీ నెలకొంది. రాజకీయ విభేదాల నేపథ్యంలో రాష్ట్రంలో నితీశ్‌లేని ప్రభుత్వం ఏర్పాటుకావాలంటూ చిరాగ్‌ పాసవాన్‌ ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. కామన్‌ వెల్త్‌ క్రీడల్లో బంగారు పతకం సాధించిన 27 ఏళ్ల శ్రేయాషి సింగ్‌ జాముయ్‌ స్థానం నుంచి BJP తరఫున పోటీ చేస్తున్నారు. ఈ స్థానానికి RJD నుంచి విజయ్‌ ప్రకాశ్‌ యాదవ్‌ బరిలోకి దిగారు. అయితే BJPకి అనుకూల వ్యాఖ్యలు చేస్తున్న ఎల్‌జేపీ మాత్రం ఈ స్థానంలో తన అభ్యర్థిని ప్రకటించలేదు.

ఇక రాష్ట్ర కేబినెట్‌లో మంత్రులుగా ఉన్న ప్రేమ్‌ కుమార్‌ గయ నుంచి పోటీ చేస్తున్నారు. విజయ్‌కుమార్‌ సిన్హా , రామ్‌ నారాయణ్‌ మండల్‌, క్రిష్ణ నందన్‌ ప్రసాద్‌ వర్మ,జయకుమార్‌ సింగ్‌,సంతోష్‌కుమార్‌ తొలి విడతలోనే తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వీరిలో ప్రసాద్‌ వర్మ, జయకుమార్‌ సింగ్‌, సంతోష్‌కుమార్‌ JDUకి చెందిన వారు కాగా..మిగతా ముగ్గురూ BJPకి చెందిన మంత్రులు ఉన్నారు. మరోవైపు గయ జిల్లాలోని ఇమామ్‌గంజ్‌ స్థానానికి ఉత్కంఠ నెలకొంది. ఈ స్థానానికి మాజీ ముఖ్యమంత్రి, హిందూస్థానీ అవామ్‌ మోర్చ అధ్యక్షుడు జితన్‌ రామ్‌ మాంజి NDA తరఫున పోటీ చేస్తున్నారు. ఆయనకు ప్రత్యర్థిగా ఉదయ్‌ నారాయణ్‌చౌదరి నిలిచారు. ఈయన గత కొన్నేళ్లుగా JDUకి మద్దతుగా నిలుస్తూ వస్తున్నారు. కానీ, తాజా ఎన్నికల్లో RJD తరఫున పోటీ చేస్తున్నారు. మరోవైపు నవంబర్‌ రెండో తేదీన సెకండ్‌ ఫేస్‌లో 94 అసెంబ్లీ స్థానాలు, నవంబర్‌ ఏడో తేదీన 78 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయ్‌. నవంబర్‌ పదో తేదీన ఫలితాలు వెల్లడికానున్నాయ్‌.

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.