పాన్ నె౦బర్ ప్రాముఖ్య౦

పాన్ కార్డు (పర్మనెంట్ అకౌంట్ నెంబర్) చాలా అవసరం. ఈ కార్డును ఆదాయపు పన్ను శాఖ జారీ చేస్తుంది. ఇంగ్లీష్ అక్షరాలు, అంకెల కలగలసి పాన్ నెంబర్ ఉంటుంది. పాన్‌కార్డు అనేది గుర్తింపు ప‌త్రంగా కూడా ప‌నిచేస్తుంది. పన్ను చెల్లించాలన్నా, పలు ఆర్థిక లావాదేవీలకు పాన్ తప్పనిసరి. పాన్ కార్డు ఏ ఏ స౦దర్భాల్లో అవసరమో చూద్దా౦. జీవిత బీమా ప్రీమియం చెల్లింపులు ఒక ఏడాదిలో రూ.50,000 లేదా ఆపైకి చేరితే పాన్ వివరాలు అందించాలి. మ్యూచువల్ […]

పాన్ నె౦బర్ ప్రాముఖ్య౦
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 07, 2019 | 5:25 PM

పాన్ కార్డు (పర్మనెంట్ అకౌంట్ నెంబర్) చాలా అవసరం. ఈ కార్డును ఆదాయపు పన్ను శాఖ జారీ చేస్తుంది. ఇంగ్లీష్ అక్షరాలు, అంకెల కలగలసి పాన్ నెంబర్ ఉంటుంది. పాన్‌కార్డు అనేది గుర్తింపు ప‌త్రంగా కూడా ప‌నిచేస్తుంది. పన్ను చెల్లించాలన్నా, పలు ఆర్థిక లావాదేవీలకు పాన్ తప్పనిసరి. పాన్ కార్డు ఏ ఏ స౦దర్భాల్లో అవసరమో చూద్దా౦.

  • జీవిత బీమా ప్రీమియం చెల్లింపులు ఒక ఏడాదిలో రూ.50,000 లేదా ఆపైకి చేరితే పాన్ వివరాలు అందించాలి.
  • మ్యూచువల్ ఫండ్స్‌లో రూ.50,000 లేదా ఆపైన మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయాలన్నా పాన్ తప్పనిసరి. అలాగే ఏదైనా సెక్యూరిటీ కొనుగోలు/అమ్మకం విలువ రూ.లక్ష దాటినా కూడా పాన్ కావాల్సిందే.
  • ఒక రోజులో బ్యాంకులో రూ.50,000 లేదా ఆపైన మొత్తాన్ని బ్యాంక్ అకౌంట్‌లో జమ చేయాలన్నా కూడా పాన్ వివరాలు తెలియజేయాల్సిందే.
  • క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, రుణాలకు దరఖాస్తు చేసుకోవాలన్నా కూడా పాన్ నె౦బర్ ఇవ్వాల్సిందే.
  • కంపెనీ షేర్లను కొనుగోలు చేసేందుకు రూ.50,000 లేదా ఆపైన మొత్తాన్ని వెచ్చిస్తే పాన్ వివరాలు తెలియజేయాల్సిందే. అదేసమయంలో డిబెంచర్లు, బాండ్లలో ఇన్వెస్ట్‌మెంట్లకు కూడా ఇదే షరతు వర్తిస్తుంది.
  • మీరు ఏదైనా బ్యాంకులో లేదా ఆర్థిక సంస్థలో రూ.50,000లకు పైన మొత్తాన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలంటే పాన్  నె౦బర్ ఖ‌చ్చితంగా కావాలి. అలాగే రూ.50,000కు పైన నగదును పోస్టాఫీస్ సేవింగ్స్ ఖాతాలో జమ చేయాలన్నా పాన్ నెంబర్ కావాల్సిందే.
  • హోటళ్లు, రెస్టారెంట్లకు వెళ్లినప్పుడు అక్కడ బిల్లు రూ.25,000 దాటిందంటే.. ఆ బిల్లు చెల్లించాలన్న పాన్ నెంబర్ చెప్పాల్సిందే.

పాన్ కార్డు ఉంటే పర్వాలేదు. ఒకవేళ మీ వద్ద పాన్ కార్డు లేకపోతే ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ మార్గాల్లో పాన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు.