జాన్వీ ‘గుంజ‌న్ సక్సేనా’ సినిమాపై ఎయిర్ ఫోర్స్ ఫిర్యాదు

జాన్వీ 'గుంజ‌న్ సక్సేనా' సినిమాపై ఎయిర్ ఫోర్స్ ఫిర్యాదు

దివంగ‌త న‌టి శ్రీదేవి కూతురు జాన్వీ క‌పూర్ న‌టించిన 'గుంజ‌న్ స‌క్సేనా-ది కార్గిల్ గ‌ర్ల్' సినిమా.. ఈ రోజు నెట్ ఫ్లిక్స్‌లో విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో మొట్ట‌మొద‌టి మ‌హిళా పైలెట్ గుంజ‌న్ స‌క్సేనా జీవితం ఆధారంగా ఈ సినిమాను తీశారు. 1999లో జ‌రిగిన కార్గిల్ యుద్ధంలో పాల్గొన్నారు. యుద్ధంలో గాయ‌ప‌డిన సైనికుల‌ను ర‌క్షించ‌డంలో..

TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 12, 2020 | 11:01 PM

దివంగ‌త న‌టి శ్రీదేవి కూతురు జాన్వీ క‌పూర్ న‌టించిన ‘గుంజ‌న్ స‌క్సేనా-ది కార్గిల్ గ‌ర్ల్’ సినిమా.. ఈ రోజు నెట్ ఫ్లిక్స్‌లో విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో మొట్ట‌మొద‌టి మ‌హిళా పైలెట్ గుంజ‌న్ స‌క్సేనా జీవితం ఆధారంగా ఈ సినిమాను తీశారు. 1999లో జ‌రిగిన కార్గిల్ యుద్ధంలో పాల్గొన్నారు. యుద్ధంలో గాయ‌ప‌డిన సైనికుల‌ను ర‌క్షించ‌డంలో ఆమె కీల‌క పాత్ర పోషించారు. కార్గిలో ఆమె చేసిన సేవ‌ల‌కు గాను భార‌త ప్ర‌భుత్వం శౌర్య వీర్ పుర‌స్కారంతో స‌త్క‌రించింది. అయి‌తే ఈ చిత్రంలో కొన్ని స‌న్నివేశాల‌ను ప్ర‌తి కూలంగా చిత్రీక‌రించారు అంటూ భార‌త వైమానిక ద‌ళం ఫిల్మ్ సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు చేసింది. ఎయిర్ ఫోర్స్ మీద నెగిటివ్ అభిప్రాయాన్ని క‌లిగించేలా ఈ చిత్రం ఉంద‌ని సెంట్ర‌ల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ స‌ర్టిఫికేష‌న్‌కు లేఖ‌ రాసింది.

ఈ లేఖ‌ను నెట్ ఫ్లిక్స్‌, ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్ హౌస్‌కు కూడా పంపింది. ఈ సినిమాను తీస్తున్న‌ప్పుడు ఎయిర్ ఫోర్స్ గౌర‌వ మ‌ర్యాద‌లు పెంచేలా తీస్తామ‌ని చెప్పారు. కానీ సినిమాలోని కొన్ని స‌న్నివేశాలు, సంభాష‌ణ‌లు అభ్యంత‌ర‌క‌రంగా ఉన్నాయంటూ త‌మ దృష్టికి వ‌చ్చింద‌ని తెలిపారు ఎయిర్ ఫోర్స్ అధికారులు. గుంజ‌న్ స‌క్సేనా పాత్ర‌కు హైప్ తీసుకురావ‌డం కోసం ఎయిర్ ఫోర్స్‌పై నెగిటివ్ ప్ర‌భావం వ‌చ్చేలా తీసార‌ని లేఖ‌లో పేర్కొన్నారు. ఈ సినిమాలో లింగ భేదాన్ని చూపుతూ తీసిన స‌న్నివేశాలు అభ్యంత‌ర క‌రంగా ఉన్నాయ‌ని, వాటిని తొల‌గించ‌డం లేదా మార్చ‌డం చేయాల‌ని ఎయిర్ ఫోర్స్ అధికారులు సూచించారు.

Read More:

ప్రైవేట్ ఆస్ప‌త్రుల‌కు తెలంగాణ ప్ర‌భుత్వ హెచ్చ‌రిక‌

ప‌నికి రావ‌డం లేద‌ని 12 ఏళ్ల బాలుడిని చావ‌గొట్టిన య‌జ‌మాని

క‌రోనా నుంచి కోలుకున్న డైరెక్ట‌ర్‌ రాజ‌మౌళి కుటుంబం

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu