జీఎంకు దివ్యా సూర్యదేవర రాజీనామా..!
అమెరికా ఆటోమొబైల్ దిగ్గజం జనరల్ మోటార్స్ కో సీఎఫ్‌వో పదవి నుంచి దివ్యా సూర్యదేవర వైదొలిగినట్లుగా సమాచారం. దివ్యా సూర్యదేవర రాజీనామా విషయాన్ని జీఎం...
అమెరికా ఆటోమొబైల్ దిగ్గజం జనరల్ మోటార్స్ కో సీఎఫ్‌వో పదవి నుంచి దివ్యా సూర్యదేవర వైదొలిగినట్లుగా సమాచారం. దివ్యా సూర్యదేవర రాజీనామా విషయాన్ని జీఎం కూడా ధ్రువీకరించినట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ ప్రచూరించింది. ఆమె శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఆన్‌లైన్ కామర్స్ సంస్థ స్ట్రిప్ ఐఎన్‌సీలో చేరుతున్నారని పేర్కొంది. తమ కంపెనీలో చేరుతున్న విషయాన్ని స్ట్రిప్ కూడా దృవీకరించింది. దివ్యా సూర్యదేవర రాజీనామా అమెరికాలో ఆటోరంగాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. జీఎంలో ఆమె స్థానాన్ని ప్రస్తుతం ఉత్తర అమెరికా విభాగానికి చీఫ్ పైనాన్షియల్ ఆఫీసర్గా పనిచేస్తున్న జాన్ స్టాప్లిటన్ భర్తీ చేయనున్నారు. కొత్త వారు వచ్చే వరకూ ఆయన ఆ బాధ్యతల్లో కొనసాగుతారు.
హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో ఎంబిఏ పూర్తి చేసిన దివ్యా సూర్యదేవర స్వస్థలం తమిళనాడు. ఆమె 2002లో వరల్డ్ బ్యాంక్‌లో ఇంటర్న్ షిప్ చేశారు. అదే సంవత్సరం జనరల్ మోటర్స్ లో సాధారణ ఉద్యోగిగా చేరారు. జనరల్ మోటర్స్ అమెరికాలోని నంబర్ వన్ ఆటో మొబైల్ సంస్ధ. ఈ 2009వ సంవత్సరంలో దివ్యా జనరల్ మోటర్స్ సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ గా ఎంపికయ్యారు. అంచెలంచెలుగా ఎదుగుతూ సీఎఫ్‌వో బాధ్యలు నిర్వహించారు దివ్యా సూర్యదేవర.