హైదరాబాదీలు చికెన్‌ తెగ తినేస్తున్నారు.. గ్రేటర్‌లో ఒక్క రోజులో ఎంత చికెన్‌ తింటున్నారో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే.

హైదరాబాదీలకు చికెన్‌తో విడదీయలేని సంబంధం ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. బిర్యానీ నుంచి మొదలు పెడితే హలీమ్‌ వరకూ చికెన్‌ను లొట్టేలేసుకోని తింటుంటారు. అయితే చికెన్‌ తినడం విషయంలో తాజాగా హైదరాబాద్‌ సరికొత్త రికార్డును సృష్టించింది. తాజా లెక్కల ప్రకారం..

హైదరాబాదీలు చికెన్‌ తెగ తినేస్తున్నారు.. గ్రేటర్‌లో ఒక్క రోజులో ఎంత చికెన్‌ తింటున్నారో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే.
Follow us

|

Updated on: Dec 28, 2020 | 3:17 PM

Hyderabad top in chicken eating: హైదరాబాదీలకు చికెన్‌తో విడదీయలేని సంబంధం ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. బిర్యానీ నుంచి మొదలు పెడితే హలీమ్‌ వరకూ చికెన్‌ను లొట్టేలేసుకోని తింటుంటారు. అయితే చికెన్‌ తినడం విషయంలో తాజాగా హైదరాబాద్‌ సరికొత్త రికార్డును సృష్టించింది. తాజా లెక్కల ప్రకారం.. కరోనా ప్రభావం తగ్గిన నవంబర్‌, డిసెంబర్‌ నెలలో చికెన్‌ వాడకంలో హైదరాబాద్‌ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో రోజుకి ఏకంగా 6 లక్షల కిలోల చికెన్‌ అమ్ముడుపోతుండడం విశేషం. ఇది దేశంలోనే అత్యధికం. ఇక హైదరాబాద్‌ తర్వాతి స్థానాల్లో ఢిల్లీ, బెంగళూరులు ఉన్నాయని అంచనా. ఇదిలా ఉంటే చికెన్‌ అమ్మకాలు ఓ రేంజ్‌లో ఉన్నా మటన్‌ అమ్మకాలు మాత్రం చాలా తక్కువ అని నివేదికలు చెబుతున్నాయి. రోజుకి లక్షకిలోల మటన్‌ మాత్రమే అమ్ముడుపోతోంది. చికెన్‌తో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ. ధర విషయానికొస్తే చికెన్‌తో పోల్చుకుంటే మటన్‌ ధర ఎక్కువ ఉండడమే దీనికి కారణమని చెబుతున్నారు.