Political Leaders died in 2020: ఈ సంవత్సరంలో ఎవరెవరు రాజకీయ ప్రముఖులు మరణించారంటే..
2020 సంవత్సరం ముగియబోతోంది. ఈ సంవత్సరంలో అందరికి కష్టాలే తెచ్చి పెట్టింది. 2020 సంవత్సరంలో భవిష్యత్తు మారుతుందని, నూతన మార్పులకు బాటలు వేస్తుందని అందరు అనుకున్నారు. కానీ ఈ ఏడాది భవిష్యత్తులో మరిన్ని ..
2020 సంవత్సరం ముగియబోతోంది. ఈ సంవత్సరంలో అందరికి కష్టాలే తెచ్చి పెట్టింది. 2020 సంవత్సరంలో భవిష్యత్తు మారుతుందని, నూతన మార్పులకు బాటలు వేస్తుందని అందరు అనుకున్నారు. కానీ ఈ ఏడాది భవిష్యత్తులో మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టింది. కానీ కరోనా మహమ్మారి అందరి జీవితాలపై నీళ్లు చల్లింది. ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలు పోవడమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా వ్యాపారాలపై తీవ్రమైన దెబ్బ కొట్టింది. అలాగే భారత్ లోనూ కరోనా ఈ ఏడాది తీవ్ర ప్రభావం చూపింది. ప్రముఖులు, రాజకీయ నేతలు ఇలా ఎందరో మరణించారు. ఈ ఏడాది దేశ రాజకీయ ప్రస్థానంలో కీలక పాత్ర పోషించి అమరులైన కొంత మంది నాయకులెవరో ఇప్పుడు చూద్దాం..
తరుణ్ గోగోయ్ -Tarun Gogoi అసోం మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గోగోయ్ కరోనా మహమ్మారి కారణంగా మరణించారు. కోవిడ్‌తో ఆస్పత్రిలో చేరిన ఆయన కరోనా నుంచి బయట పడలేకపోయారు. కోవిడ్ కారణంగా శరీరంలో కొన్ని అవయవాలు దెబ్బతినడంతో నవంబర్ 23న మరణించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన తరుణ్ గోగోయ్ ఆగస్టు 25న కోవిడ్ బారిన పడ్డారు. గువహటి మెడికల్ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. డిశ్చార్జ్ అయిన రెండు నెలల తర్వాత మృతి చెందారు.
అహ్మద్ పటేల్- Ahmed Patel సీనియర్ కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ సోనియాగాంధీకి అత్యంత అప్తులు. రాజకీయంగా ఆమెకు ముఖ్య సలహాదారుడైన ఆయన … నవంబర్ 25న మృతి చెందాడు. కరోనా బారిన పడిన ఆయన గురుగావ్‌లో మేదాంత ఆస్పత్రిలో చేరాడు. ఆరోగ్యం మరింత క్షిణించడంతో ఆయన తుది శ్వాస విడిచారు. కోవిడ్ కారణంగా పలు అవయవాలు విఫలమై 71 ఏళ్ల వయసులోను కన్ను మూశారు. అహ్మద్‌పటేల్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుముకగా పని చేశారు. చాలా ఏళ్ల నుంచి పార్టీ వ్యూహాకర్తగా పని చేశారు. సోనియాగాంధీకి వెన్నుదన్నుగా ఉంటూ పార్టీకి ఎన్నో సేవలు అందించిన అహ్మద్ పటేల్ మణించడం పార్టీ జీర్ణించుకోలేకపోయింది.
రామ్ విలాస్ పాస్వాన్- Ramvilas paswan రామ్ విలాస్ పాస్వాన్.. షోషలిస్టు ఉద్యమం ద్వారా తెరపైకి వచ్చారు. ఆయన దేశంలోని ప్రముఖ దళిత నాయకుల్లో ఒకరిగా ఎదిగారు. లోక్ జనశక్తి పార్టీ వ్యవస్థాపకుడు అయిన వినియోగదారుల వ్యవహారాలు, ప్రజా పంపిణీ శాఖ మంత్రిగా పని చేసిన రామ్ విలాస్.. అక్టోబర్ 8న మరణించారు. కొన్ని వారాల కిందట గుండెకు శస్త్ర చికిత్స చేయించుకున్న ఆయన తుది శ్వాస విడిచారు.
సురేష్ అంగడి – Suresh Angadi కరోనా కారణంగా మరణించిన మరో ముఖ్య నేత సురేష్ అంగడి. రాష్ట్ర రైల్వే మంత్రిగా పని చేసిన ఆయన కరోనా మహమ్మారి కారణంగా సెప్టెంబర్ 23న మరణించారు. ఆయన వయసు 65 ఏళ్లు. 1955 జూన్ 1న జన్మించిన సురేష్.. కర్ణాటకలోని బెల్గాం నుంచి లోక్‌సభ సభ్యుడిగా నాలుగు సార్లు ఎన్నికయ్యారు. వాస్తవానికి 2004లో తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసినప్పటి నుంచి ఏనాడు ఓటమి చవిచూడలేదు.1996లో బెల్గాం జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడిగా సురేష్ తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 2001లో బీజేపీ బెల్గాం అధ్యక్షుడిగా నామినేట్ అయ్యారు. జిల్లా పదవికి ఎదిగిన మూడేళ్లకే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీ టికెట్ ఇచ్చింది. అప్పటి కాంగ్రెస్ సిట్టింగ్ అభ్యర్థి అమర్ సింగ్ పాటిల్‌ను ఓడించి జైత్రయాత్రను కొనసాగించారు.
ప్రణబ్ ముఖర్జీ -Pranab Mukherjee మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆగస్టు31న కరోనాతో మరణించారు. 2012 నుంచి 2017 వరకు భారత రాష్ట్రపతిగా సేవలందించారు. ప్రణబ్‌కు కరోనా సోకడంతో మూడు వారాల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందారు. కాగా, చివరకు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా తుది శ్వాస విడిచారు. ఆగస్టు 10న కోవిడ్‌తో ఆస్పత్రిలో చేరారు. 1935 డిసెంబర్ 31న జన్మించారు. భారత రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఉన్నత స్థానాలను అధిరోహించారు. కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక పదవులు చేపట్టారు.
అమర్ సింగ్ – Amar Singh సమాజ్ వాది పార్టీ మాజీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు అమర్ సింగ్ ఆగస్టు 1న సింగపూర్‌లో మరణించారు. కిడ్నీ సంబంధిత సమస్యలతో ఆస్పత్రిలో చేరారు. ఆయన వయసు 64 ఏళ్లు. 1956 జనవరి 27న ఉత్తరప్రదేశ్ లోని అలీఘర్‌లో జన్మించారు. వ్యాపార వేత్తగా, రాజకీయ నాయకుడిగా భారత్‌లో అత్యంత ప్రభావంతమైన వ్యక్తగా గుర్తింపు తెచ్చుకున్నారు. సినీ, రాజకీయ, వ్యాపార సమాజంలో ఎంతో మంది స్నేహితులను సంపాదించుకున్నారు. అమర్ సింగ్ బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్‌కు అత్యంత ఆప్తుడు.
లాల్ జీ టాండన్ -Lal ji Tandon మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్ జీ టాండన్ జులై 21న కన్నుమూశారు. ఆయన వయసు 85 ఏళ్లు. అనారోగ్యం కారణంగా లక్నోలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. పార్టీతో సంబంధం లేకుండా అన్ని పార్టీల్లోనూ సన్నిహితులను సంపాదించుకున్నారు. ఈయనే కాకుండా మాజీ కాంగ్రెస్ నాయకుడు రామకృష్ణ ద్వివేది, పార్లమెంటేరియన్ గోపినాథ్ గణపతి నారాయణ డియా, కర్ణాటక మాజీ గవర్నర్ టిఎన్ చతుర్వేది, అజిత్ జోగి, భనర్వార్ లాల్ శర్మ, శివాజిరావ్ పాటిల్ నిలాంగేకర్ తదితర నాయకులు ఈ జాబితాలో ఉన్నారు.