దివిసీమ పర్యటనలో నారా లోకేష్, నివర్ సైక్లోన్.. అకాల వర్షాలతో దెబ్బతిన్న రైతులకు సంఘీభావం
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కృష్ణా జిల్లా పర్యటనలో భాగంగా దివిసీమలో పర్యటిస్తున్నారు. అవనిగడ్డ నియోజకవర్గం కొత్త మాజేరు వద్ద పంట నష్టపోయిన..
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కృష్ణా జిల్లా పర్యటనలో భాగంగా దివిసీమలో పర్యటిస్తున్నారు. అవనిగడ్డ నియోజకవర్గం కొత్త మాజేరు వద్ద పంట నష్టపోయిన రైతులను లోకేష్ పరామర్శించారు. రైతుల కష్టసుఖాలను అడిగితెలుసుకున్నారు. ఈ సందర్భంలో మాజీ మంత్రి మండలి బుద్ద ప్రసాద్ ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. అనంతరం నివర్ సైక్లోన్, అకాల వర్షాలతో దెబ్బతిన్న వరి పొలాలను నారా లోకేష్ పరిశీలించారు. రైతుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తెలుగుదేశం పార్టీ రైతులకు అండగా ఉంటుందని లోకేష్ భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. తీవ్రంగా నష్టపోవడంవల్లే వరి పంటను దున్నేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని లోకేష్ దగ్గర రైతులు వాపోయారు. దివిసీమ పర్యటనలో భాగంగా దివిసీమ వెళుతూ మచిలీపట్టణం మూడు స్తంభాల సెంటర్లోనూ ఆగి రైతులతో మాట్లాడిన లోకేష్, నివర్ తుఫాన్ నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు.