Antarvedi New Chariot : సిద్ధమైన అంతర్వేది నూతన రథం..విజయవంతమైన ట్రయల్‌ రన్

అంతర్వేది ఆలయానికి కొత్త రథం సిద్ధమైంది. తూర్పుగోదావరి జిల్లాలలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి కొత్త రథం​ ముస్తాబైంది. ఏడంతస్తుల రథం పూర్తి స్ట్రక్చర్ నిర్మించడంతో పాటు చక్రాలు కూడా ఏర్పాటు చేశారు.

Antarvedi New Chariot : సిద్ధమైన అంతర్వేది నూతన రథం..విజయవంతమైన ట్రయల్‌ రన్
Follow us
Sanjay Kasula

|

Updated on: Dec 28, 2020 | 2:10 PM

అంతర్వేది ఆలయానికి కొత్త రథం సిద్ధమైంది. తూర్పుగోదావరి జిల్లాలలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి కొత్త రథం​ ముస్తాబైంది. ఏడంతస్తుల రథం పూర్తి స్ట్రక్చర్ నిర్మించడంతో పాటు చక్రాలు కూడా ఏర్పాటు చేశారు.

మూడు నెలల రికార్డు సమయంలో అధికారులు ప్రధాన నిర్మాణాన్ని పూర్తి చేశారు. మంత్రి వేణు గోపాల కృష్ణ ,జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి కూడా రథాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో దేవాదాయశాఖ అధికారులు నేడు రథం ట్రయల్‌ రన్ నిర్వహించారు.

ప్రధాన ఆలయానికి ఎదురుగా నిర్మితమవుతున్న రథాన్ని తాళ్ళుతో లాగుతూ బయటకు తీసుకు వెళ్లారు. రథం సునాయాసంగా కదలడంతో ట్రయల్‌ రన్ విజయవంతంగా ముగిసింది. పాత రథానికి భిన్నంగా కొత్త రథంలో బ్రేక్ సిస్టం కూడా ఏర్పాటు చేశారు. దీంతో పాటు రథం కింద జాకీలు అమర్చి అవసరమైన చోట సునాయసంగా వెనక్కి తీసుకునే విధంగా ఏర్పాట్లు పూర్తి చేశారు.

నాలుగు నెలల క్రితం రథం దగ్ధమైన విషయం సంగతి తెలిసిందే. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి, వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కొత్త రథం నిర్మాణం, రథశాల మరమ్మతులకు తక్షణం రూ.95 లక్షలు మంజూరు చేశారు. ఈ నేపథ్యంలో పాత రథం నమూనాలోనే రథం 21 అడుగుల పొడవు,16 అడుగుల వెడల్పు, 41 అడుగుల ఎత్తున, ఆరు చక్రాలతో కొత్త రథం డిజైన్‌ దేవదాయ శాఖ ఖరారు చేసింది.