AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాద్ జగద్గిరి గుట్టలో భారీ పేలుడు

హైదరాబాద్ జగద్గిరిగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలోని అస్బెస్టాస్ కాలనీ ఆటోలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆటోలో ఎక్కుతున్న యూసూఫ్ అలీ అనే వ్యక్తి కాలికి తీవ్రగాయాలయ్యాయి. బాధితుడ్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పేలుడుకు గల కారణాలు తెలియాల్సి ఉంది. యూసూఫ్ అలీ అనే వ్యక్తి ఇంటి బయట ఉన్న గోడ వద్ద ఈ పేలుడు జరిగింది. యూసూఫ్ అలీ తన ఆటో తీసుకోవడానికి బయటికి వచ్చాడు. తన కాళ్ళ కింద భారీ శబ్దంతో […]

హైదరాబాద్ జగద్గిరి గుట్టలో భారీ పేలుడు
Venkata Narayana
|

Updated on: Oct 24, 2020 | 3:03 PM

Share

హైదరాబాద్ జగద్గిరిగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలోని అస్బెస్టాస్ కాలనీ ఆటోలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆటోలో ఎక్కుతున్న యూసూఫ్ అలీ అనే వ్యక్తి కాలికి తీవ్రగాయాలయ్యాయి. బాధితుడ్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పేలుడుకు గల కారణాలు తెలియాల్సి ఉంది. యూసూఫ్ అలీ అనే వ్యక్తి ఇంటి బయట ఉన్న గోడ వద్ద ఈ పేలుడు జరిగింది. యూసూఫ్ అలీ తన ఆటో తీసుకోవడానికి బయటికి వచ్చాడు. తన కాళ్ళ కింద భారీ శబ్దంతో పేలుడు జరిగిందని అంటున్నారు కుటుంబ సభ్యులు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీం, బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పరిశీలిస్తున్నారు. ఘటన స్థలం దగ్గర నుంచి కొన్ని శాంపిల్స్ ను సేకరించారు. పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియలేదని పోలీసులు చెబుతున్నారు.

Follow Us
గజేంద్ర మోక్షాన్ని కళ్లకు కట్టే ఈ అరుదైన ఆలయం తెలుగు రాష్ట్రంలోనే
గజేంద్ర మోక్షాన్ని కళ్లకు కట్టే ఈ అరుదైన ఆలయం తెలుగు రాష్ట్రంలోనే
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. ఎంతవరకు తీసుకోవచ్చంటే..?
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. ఎంతవరకు తీసుకోవచ్చంటే..?
మనసు పంపే ప్రమాద సంకేతాలను గుర్తించండి
మనసు పంపే ప్రమాద సంకేతాలను గుర్తించండి
తెలుగులో తోప్ హీరోయిన్.. హిందీలో 100కోట్ల మూవీ చేసింది..
తెలుగులో తోప్ హీరోయిన్.. హిందీలో 100కోట్ల మూవీ చేసింది..
వన్డేలకు టీమిండియా స్క్వాడ్‎లో ఏకంగా ఏడుగురిని పక్కన పెట్టారుగా..
వన్డేలకు టీమిండియా స్క్వాడ్‎లో ఏకంగా ఏడుగురిని పక్కన పెట్టారుగా..
చేపలను ఫ్రిజ్‌లో ఎన్ని రోజులు పెట్టవచ్చు? పాడవకుండా ఏం చేయాలి
చేపలను ఫ్రిజ్‌లో ఎన్ని రోజులు పెట్టవచ్చు? పాడవకుండా ఏం చేయాలి
గడ్డ పెరుగుతో టేస్టీ బ్రేక్ ఫాస్ట్.. ఇన్స్టంట్ ఎనర్జీనిచ్చే పోహా
గడ్డ పెరుగుతో టేస్టీ బ్రేక్ ఫాస్ట్.. ఇన్స్టంట్ ఎనర్జీనిచ్చే పోహా
డెస్క్ జాబ్ చేసే వాళ్లు చేయాల్సిన 4 ఎక్సర్‌‌సైజులు ఇవే
డెస్క్ జాబ్ చేసే వాళ్లు చేయాల్సిన 4 ఎక్సర్‌‌సైజులు ఇవే
మృగశిర కార్తె స్పేషల్.. ఘుమఘుమలాడే ఫిష్ దమ్ బిర్యానీ.. ఇంట్లో ఇలా
మృగశిర కార్తె స్పేషల్.. ఘుమఘుమలాడే ఫిష్ దమ్ బిర్యానీ.. ఇంట్లో ఇలా
బాబోయ్.. పశువులను మేపడానికి వెళ్తే.. ఇవి...
బాబోయ్.. పశువులను మేపడానికి వెళ్తే.. ఇవి...