AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బర్త్ డే బాలుడి వీర విహారం

పుట్టిన రోజు రెచ్చిపోయాడు.‌ ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలనే టార్గెట్‌తో రంగంలోకి దిగాడు. మెరుపులతో తనలోని సత్తా చూపించాడు. ధనాధన్‌ బ్యాటింగ్‌తో అదరగొడుతోంది. తాను ఫామ్‌లో ఉంటే..

బర్త్ డే బాలుడి వీర విహారం
Sanjay Kasula
|

Updated on: Oct 27, 2020 | 10:25 PM

Share

Warner Super Batting : పుట్టిన రోజునాడు వార్నర్ రెచ్చిపోయాడు.‌ ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలనే టార్గెట్‌తో రంగంలోకి దిగాడు. అద్భుతమైన మెరుపులతో తనలోని సత్తా చూపించాడు. ధనాధన్‌ బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. తాను ఫామ్‌లో ఉంటే ఎంత ప్రమాదమో వార్నర్‌ మరోసారి నిరూపించాడు. కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ మంగళవారం తన 34వ పుట్టినరోజును జరుపుకున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌లో పవర్‌ప్లేలో అత్యధిక పరుగులు 52 చేసిన ఆటగాడిగా వార్నర్‌ నిలిచాడు.

ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడిన వార్నర్‌.. 25 బంతుల్లోనే 6ఫోర్లు, 2సిక్సర్ల సాయంతో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ముఖ్యంగా రబాడ వేసిన ఆరో ఓవర్లో వార్నర్‌ నాలుగు ఫోర్లు, సిక్సర్‌ బాది 22 పరుగులు చేశాడు. మరో ఓపెనర్‌ వృద్ధిమాన్‌ సాహా కలిసి రావడంతో వార్నర్ దూకుడు పెంచాడు. వార్నర్‌ తన సహజమైన ఆటతీరుతో ప్రత్యర్థి బౌలర్లను ఉతికారేస్తున్నాడు.

Follow Us