AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Husband Love: భార్యపై భర్త ప్రేమ.. ఒంటికాలిపై 120 కి.మీ. నడిచి అంతర్వేదికి చేరుకొని మొక్కులు తీర్చుకున్న భర్త..

తిరుణంపాలెం గ్రామానికి చెందిన కుప్పల స్వామి భార్య సత్యవతికి ఆరోగ్యం క్షీణించింది. దీంతో తన భార్య ఆరోగ్యం బాగుపడాలని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని మొక్కుకున్నాడు. భార్య అర్యోగం మెరుగు పడింది. కోరుకున్న కోర్కెను స్వామి తీర్చడంతో అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికీ మొక్కిన  మొక్కును తీర్చుకునేందుకు రెడీ అయ్యాడు స్వామి. అయితే అతనికి ఒక్క కాలు మాత్రమే ఉంది.

Husband Love: భార్యపై భర్త ప్రేమ.. ఒంటికాలిపై 120 కి.మీ. నడిచి అంతర్వేదికి చేరుకొని మొక్కులు తీర్చుకున్న భర్త..
Husband's Love
Pvv Satyanarayana
| Edited By: Surya Kala|

Updated on: Nov 05, 2023 | 12:29 PM

Share

కష్ట సుఖాల్లో తోడు నీడా ఉంటూ నిండు నూరేళ్లు కలిగి జీవిస్తామని భార్యాభర్తల బంధంలో అడుగు పెట్టి కుటుంబం కోసం జీవిస్తారు. కాలంలో వచ్చిన మార్పుల్లో భాగంగా నేటి యువత ఆలోచనల్లో మార్పులు వచ్చి భార్యాభర్తల బంధంలో బీటలు వస్తున్నాయి. పెళ్లి పందిరికి కట్టిన మామిడాకులు ఎండకుండానే మా విడాకులు అంటూ ప్రకటించే రోజులు వచ్చాయి. అయితే ఇలాంటి వారికీ ఆదర్శంగా ఎంతోమంది భార్యాభర్తలు నిలుస్తున్నారు. తమ జంటలో ఒకరికి కష్టం వస్తే.. నేను ఉన్నానంటూ తోడునీడగా కడవరకూ నిలుస్తూ ఇది కదా వివాహవ్యవస్థకు ఉన్న అర్ధం.. మూడుముళ్లకు ఉన్న బలం అని చెప్పకనే చెప్పేస్తున్నారు. తాజాగా అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్యకు నయం అయితే.. లక్ష్మీనరసింహ స్వామిని  దర్శించుకుంటానని మొక్కుకున్నాడు ఓ వృద్ధుడైన భర్త,, తన కోరిక తీర్చిన దైవ దర్శనానికి వెళ్లి తన మొక్కును తీర్చుకున్నాడు. ఈ ఘటన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

భార్య అనారోగ్యం నుండి కోలుకోవాలని మొక్కుకుని ఒంటికాలితో నడిచి పాదయాత్ర చేశాడు ఓ భర్త. తనకి ఒక కాలు మాత్రమే ఉన్నా లెక్క చేయకుండా.. తన భార్య కోసం .. ఒంటి కాలుపై పాదయాత్ర చేశాడు ఓ భక్తుడు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం తిరుణంపాలెం గ్రామానికి చెందిన కుప్పల స్వామి భార్య సత్యవతికి ఆరోగ్యం క్షీణించింది. దీంతో తన భార్య ఆరోగ్యం బాగుపడాలని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని మొక్కుకున్నాడు. భార్య అర్యోగం మెరుగు పడింది. కోరుకున్న కోర్కెను స్వామి తీర్చడంతో అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికీ మొక్కిన  మొక్కును తీర్చుకునేందుకు రెడీ అయ్యాడు స్వామి.

అయితే అతనికి ఒక్క కాలు మాత్రమే ఉంది. గతంలో ప్రమాదంలో కాలు కోల్పోయిన స్వామి తన ఒంటి కాలితో సొంతూరు తిరుణంపాలెం నుంచి స్వామివారి మొక్కు తీర్చుకునేందుకు అంతర్వేది వరకు ఉన్న ఒక్క ఒంటి కాలిపై దాదాపు 120 కిలోమీటర్లు నడిచాడు. అంతర్వేదికి చేరుకోవడానికి 16 రోజులు సమయం పట్టింది.  శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దర్శించుకుని మొక్కులు తీర్చుకున్న భక్తుడు.

తన భార్య అనారోగ్యానికి గురి అయినప్పుడు అంతర్వేది లక్ష్మీనరసింహస్వామిని వేడుకున్నానని వెంటనే భార్య ఆరోగ్యం కుదుటపడిందని.. అందుకే ఒంటికాలిపై నడిచి వచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కు తీర్చుకున్నానని తెలిపాడు స్వామి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..