తెలంగాణకు రెండు భారీ పెట్టుబడులు

ఆరేళ్ళ క్రితం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణకు పారిశ్రామిక పెట్టుబడులు క్రమం తప్పకుండా వస్తున్నాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ట్రాక్ రికార్డు మెరుగ్గా వుండడంతో పలు సంస్థలు...

తెలంగాణకు రెండు భారీ పెట్టుబడులు

Huge investments for telangana state: ఆరేళ్ళ క్రితం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణకు పారిశ్రామిక పెట్టుబడులు క్రమం తప్పకుండా వస్తున్నాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ట్రాక్ రికార్డు మెరుగ్గా వుండడంతో పలు సంస్థలు తెలంగాణపై ఆసక్తి చూపుతున్నాయి. తాజాగా రెండు భారీ సంస్థలు పెద్ద మొత్తంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. ఈ రెండు సంస్థలు మంగళవారం తమ పెట్టుబడుల గురించి కీలక ప్రకటన చేశాయి.

తెలంగాణ ఐటీ, మునిసిపల్ శాఖా మంత్రి కే.తారక రామారావుతో ప్రగతిభవన్‌లో భేటీ అయిన లారస్ ల్యాబ్స్ ప్రతినిధులు తెలంగాణ రాష్ట్రంలో 300 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టబోతున్నట్లు తెలిపారు. అదే సమయంలో గ్రాన్యుల్స్ ఇండియా ప్రతినిధులు కూడా మంత్రి కేటీఆర్‌ను కలిసారు. గ్రాన్యుల్స్ ఇండియా తరపున రాష్ట్రంలో 400 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్న ప్రకటించారు. రెండు కంపెనీలు కలిసి రాష్ట్రంలో 700 కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతున్నారు.

తమ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ల కోసం 400 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నట్లు గ్రాన్యూల్స్ ఇండియా ప్రతినిధులు తెలిపారు. రెండు కంపెనీలకు మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం తరపున అవసరమయ్యే అన్ని రకాల సహాయసహకారాలను అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి తమ ప్రభుత్వం కట్టుబడి వుందని ఆయన తెలిపారు.

Also read: ధోనీ అభిమానులకు శుభవార్త.. సీఎస్కే కీలక ప్రకటన

Also read: వికారాబాద్ అడవుల్లో కాల్పుల కలకలం