AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న టైమ్‌ మ్యాగజైన్‌ సరికొత్త ప్రయోగం!

ప్రపంచంలో ఏ పత్రికైనా పరిస్థితులను బట్టి మాస్టర్‌హెడ్‌ను పైకి కిందికి జరుపుకుంటుందే తప్ప మొత్తం పేరే మార్చదు.. అలా మార్చుకోడానికి ఇష్టపడవు.. న్యూస్‌ వీక్‌ అయితే న్యూస్‌వీక్‌ అన్న పేరుతోనే వస్తుందే తప్ప వేరే పేరుతో రాదు..

అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న టైమ్‌ మ్యాగజైన్‌ సరికొత్త ప్రయోగం!
Balu
| Edited By: |

Updated on: Oct 28, 2020 | 11:35 AM

Share

ప్రపంచంలో ఏ పత్రికైనా పరిస్థితులను బట్టి మాస్టర్‌హెడ్‌ను పైకి కిందికి జరుపుకుంటుందే తప్ప మొత్తం పేరే మార్చదు.. అలా మార్చుకోడానికి ఇష్టపడవు.. న్యూస్‌ వీక్‌ అయితే న్యూస్‌వీక్‌ అన్న పేరుతోనే వస్తుందే తప్ప వేరే పేరుతో రాదు.. కానీ టైమ్‌ అనే వార పత్రిక ఓ సరికొత్త ప్రయోగం చేసి పాఠకులను అమితంగా ఆకట్టుకుంటోంది.. మార్కెట్‌లో ఉన్న నవంబర్‌ రెండు పత్రికను చూడండి.. టైమ్‌ అని ఉండదు.. 97 ఏళ్ల చరిత్రలో ఇలా టైమ్‌ అనే పేరుతో రాని ప్రత్యేక సంచిక ఇదే! ఇలాంటి ప్రయోగం ఇంతకు ముందు ఎవరూ చేయలేదు.. ఇక ముందు చేస్తారేమో తెలియదు.. టైమ్‌లోని ఐఎమ్‌ అనే మధ్య అక్షరాలను తొలగించి, మొదట ఉన్న టీని చివర ఉన్న ఈ ముందుకు జరిపి, ఎడమవైపున వీవో అన్న అక్షరాలను పెట్టారు.. మొత్తం మీద ఓట్‌ అనే పేరుతో తాజా సంచికను విడుదల చేశారు.. అమెరికాకు ఈ అధ్యక్ష ఎన్నికలు ఎంత కీలకమైనవో ముఖచిత్రం ద్వారానే చెప్పేసింది టైమ్‌ మ్యాగజైన్‌! కవర్‌పేజిలో ఓ మహిళ కర్చీఫ్‌ను మాస్క్‌లా పెట్టుకుని ఉంది.. కర్చీఫ్‌పై బ్యాలెట్‌ బాక్స్‌ను, బాక్స్‌ను కాపాడుతున్నట్టుగా రెండు అరచేతులు, ఇనుప సంకెళ్లు, ఇంకా కొన్ని మార్మిక చిత్రాలు ఉన్నాయి.. ఈ కవర్‌పేజీని డిజైన్‌ చేసింది ప్రముఖ చిత్రకారుడు ఫ్రాంక్‌ షెఫర్డ్‌..

Follow Us
పిచ్చెక్కించే ఫీచర్లతో వివో కొత్త స్మార్ట్‌ఫోన్‌.. సీక్రెట్‌ ఏంటి
పిచ్చెక్కించే ఫీచర్లతో వివో కొత్త స్మార్ట్‌ఫోన్‌.. సీక్రెట్‌ ఏంటి
ఏపీలో అమానుషం.. చేతులు, మెడకు తాళ్లతో కట్టి వీధుల్లో అర్ధనగ్నంగా
ఏపీలో అమానుషం.. చేతులు, మెడకు తాళ్లతో కట్టి వీధుల్లో అర్ధనగ్నంగా
స్మార్ట్‌వాచ్‌లోని హెల్త్ రీడింగ్స్‌ కరెక్టేనా..?
స్మార్ట్‌వాచ్‌లోని హెల్త్ రీడింగ్స్‌ కరెక్టేనా..?
పెళ్లి తర్వాత అదృష్టం కలిసొచ్చే రాశులివే.. మీ రాశి ఉందా మరి !
పెళ్లి తర్వాత అదృష్టం కలిసొచ్చే రాశులివే.. మీ రాశి ఉందా మరి !
దొంగల భయం.. కొత్తకారును ఎక్కడ పార్క్‌ చేశాడో చూస్తే ఆగమే!
దొంగల భయం.. కొత్తకారును ఎక్కడ పార్క్‌ చేశాడో చూస్తే ఆగమే!
పెట్రోల్ కార్లకు ఎదురుదెబ్బ.. ఆగస్టులో ఈ కార్లు రికార్డు
పెట్రోల్ కార్లకు ఎదురుదెబ్బ.. ఆగస్టులో ఈ కార్లు రికార్డు
గణేశుడి 32 రూపాలు.. ఒక్కో రూపం వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఇదే!
గణేశుడి 32 రూపాలు.. ఒక్కో రూపం వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఇదే!
బిగ్‌బాస్‌లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హోస్ట్ ఎవరో తెలుసా?
బిగ్‌బాస్‌లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హోస్ట్ ఎవరో తెలుసా?
పాకిస్తాన్ వెళ్లనున్న భారత అథ్లెట్లు.. ఎందుకంటే?
పాకిస్తాన్ వెళ్లనున్న భారత అథ్లెట్లు.. ఎందుకంటే?
11న స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు.. కారణం ఇదే!
11న స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు.. కారణం ఇదే!