AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hibiscus Herbal Tea: మందారం టీ రోజు తాగితే కలిగే ప్రయోజనాలు ఎన్నో.. తయారీ విధానం ఎలా అంటే

Hibiscus Tea: భారత దేశంలో మందార పువ్వుకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఈ మందారం ఉత్తర ఆఫ్రికాకు ఎగుమతి చేయబడింది. అక్కడ వారు ఈ అందమైన మందారం..

Hibiscus Herbal Tea: మందారం టీ రోజు తాగితే కలిగే ప్రయోజనాలు ఎన్నో.. తయారీ విధానం ఎలా అంటే
Hibiscus Tea
Surya Kala
|

Updated on: Jun 22, 2021 | 6:22 PM

Share

Hibiscus Tea: భారత దేశంలో మందార పువ్వుకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఈ మందారం ఉత్తర ఆఫ్రికాకు ఎగుమతి చేయబడింది. అక్కడ వారు ఈ అందమైన మందారం అండాశయాల నుండి, వారు అందమైన ఎరుపు రంగు, ఆహ్లాదకరమైన రిఫ్రెష్ రుచి మరియు చాలా ఉపయోగకరమైన లక్షణాలను ఉన్న కషాయాన్ని తయారు చేయడం ప్రారంభించారు. ప్రస్తుతం ఈ మందార జాతికి యాభైకి పైగా జాతులు ఉన్నాయి, వాటిల్లో కొన్నింటిని అలంకారానికి ఉపయోగించే విధంగా డిమాండ్ ఉంటె మరికొన్నింటికి పారిశ్రామిక పంటలలో డిమాండ్ ఉంది. అయితే ఈ మందారంతో తేనీరుని కూడా తయారు చేస్తారు. ఈ హెర్బల్ మందార, టీ మరియు పానీయం కొద్దిగా పుల్లని రుచి కలిగి ఉండి ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయ్యింది.

ముఖ్యంగా అధిక రక్తపోటును నియంత్రించడంలో మందారం టీ అత్యంత ప్రయోజనకారి. మనదేశంలో ఎక్కువమందికి గుండెపోటుకు గురికావడానికి కారణం అధిక రక్త పోటు అని చెప్పవచ్చు. భారతదేశంలో ప్రతి 4 మంది పెద్దలలో ఒకరికి రక్తపోటు ఉంది. జీవనశైలి మార్పులు, ఆహారంలో మార్పులు , మందులు అధిక రక్తపోటును తగ్గిస్తాయి. దీంతో అధిక రక్తపోటు వలన కలిగే గుండె జబ్బులు, స్ట్రోక్ , కిడ్నీ వ్యాధుల నుంచి రక్షణ కలుగుతుంది.

ఆహారంలో మార్పులు , మందులు అధిక రక్తపోటును తగ్గిస్తాయి , అధిక రక్తపోటును నియంత్రించడంలో ఆరోగ్యకరమైన పానీయాలు సహాయపడతాయి.అందులో ఒకటి ఈ మందార పూల టీ. న్యూట్రిషనల్ జర్నల్ లో కూడా దీని గురించి తెలియచేశారు. ప్రస్తుతం ఈ మందార టీ పారిశ్రామికంగా భారతదేశం, ఈజిప్ట్, సుడాన్లలో మాత్రమే ఉత్పత్తి చేయబడుతోంది, ఇక్కడ పానీయం చాలాకాలంగా సంప్రదాయంగా మారింది

మందారం టీ తయారీ విధానం

మందారం పొడి రేకులు నీరు; నిమ్మ కాయ చక్కెర లేదా తేనె దాల్చినచెక్క; పుదీనా ఆకులు.

ముందుగా చల్లటి నీటిలో మందారం పొడి రేకులను వేసి రెండు గంటలు నానబెట్టండి. అనంతరం ఈ నీటి మట్టి కుండలో కానీ గాజు పాత్రలో కానీ పోసి (లోహపు పాత్రలో టీ రంగు మారుతుంది) స్టౌ మీద ఉంచి మరిగించండి. అలా మరరించిన పానీయాన్ని వడకట్టి.. చక్కర లేదా తేనే వేసుకుని నిమ్మరసం వేసుకుని తాగ వచ్చు లేదా .. ఇష్టమైన వారు దాల్చిన చెక్క లేదా పుదీనా ఆకులూ వేసుకుని తాగవచ్చు. చల్లని టీ ని ఇష్టపడే వారు ఈ మందిరం హెర్బల్ టీ లో ఐస్ ముక్కలను కూడా వేసుకుని తాజాగా పుదీనా వేసుకుని తాగవచ్చు.. లేదంటే ప్రస్తుతం ఈ మందారం టీ పాకెట్స్ వస్తున్నాయి.. వాటితో కూడా టీ తయారు చేసుకోవచ్చు.

రక్త నాళాల గోడలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది; చెడు కొలెస్ట్రాల్ నిల్వను కరిగిస్తుంది. తీవ్రమైన ఒత్తిడి ని మందారం టీ నివారిస్తుంది. దీర్ఘకాలిక అలసట నుంచి ఉపశమనం ఇస్తుంది. మెదడు పనితీరుని మెరుగుపరుస్తుంది. చర్మం రంగుని కాంతివంతం చేస్తుంది.

Also Read: :పెళ్లి వద్దు.. సహజీవనం ముద్దు.. పిల్లతో పాటు పెళ్లి చేసుకునే తల్లిదండ్రులు.. మనదేశంలోఎక్కడంటే