AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadhaar ITR Verification: ఆధార్ OTPని ఉపయోగించి ITRని ఈ-ధృవీకరణను ఇలా సులభంగా చేసుకోండి..

Aadhaar ITR Verification: ఆదాయపన్ను రిటర్న్ ఫైలింగ్ ప్రక్రియను పూర్తి చేయడానికి చాలా ముఖ్యమైన అంశం ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేయడం. ఇన్ కమ్ టాక్స్ ఫైల్ చేసే ప్రక్రియను పూర్తి చేయడానికి..

Aadhaar ITR Verification: ఆధార్ OTPని ఉపయోగించి ITRని ఈ-ధృవీకరణను ఇలా సులభంగా చేసుకోండి..
Aadhaar
Ayyappa Mamidi
|

Updated on: Mar 03, 2022 | 2:14 PM

Share

Aadhaar ITR Verification: ఆదాయపన్ను రిటర్న్ ఫైలింగ్ ప్రక్రియను పూర్తి చేయడానికి చాలా ముఖ్యమైన అంశం ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేయడం. ఇన్ కమ్ టాక్స్ ఫైల్ చేసే ప్రక్రియను పూర్తి చేయడానికి.. మీరు మీ ఆదాయపు పన్ను రిటర్న్‌లను కూడా ధృవీకరించాలి. నిర్ణీత గడువులోపు ధృవీకరణ పూర్తి చేయకపోతే మీకు దాఖలు చేసిన రిటర్న్ చెల్లనిదిగా పరిగణించబడుతుంది. ఈ ప్రక్రియను కేవలం 6 ఈజీ స్టెప్పుల్లో ఎలా పూర్తి చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

మీ రిటర్న్ ను ఆన్ లైన్ ద్వారా 6 విధాలుగా ఎలా పూర్తి చేయవచ్చో తెలుసుకోండి..

1.  ఆధార్‌తో నమోదు చేయబడిన మొబైల్ నంబర్‌పై OTP ద్వారా వెరిఫికేషన్

2. ప్రీ వ్యాలిడేటెడ్ బ్యాంక్ అకౌంట్ ద్వారా జెనరేట్ అయిన EVC పద్ధతిని వినియోగించి

3. ప్రీ వ్యాలిడేటెడ్ డీ మాట్ ఖాతా ద్వారా జెనరేట్ అయిన EVC పద్ధతిని వినియోగించి

4. ఆఫ్ లైన్ పద్ధతిలో ఏటీఎం నుంచి ఈవీసీ ద్వారా

5. నెట్ బ్యాంకింగ్ పద్ధతి వినియోగించి

6. డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్ (DSC) ఉపయోగించి

ఆధార్ OTPని ఉపయోగించి ITRని ఈ-ధృవీకరించడానికి ప్రక్రియ..

Step 1: https://www.incometax.gov.in/iec/foportal కి లాగిన్ అవ్వాలి

Step 2: క్విక్ లింక్స్ ట్యాబ్‌లో ఈ-వెరిఫై రిటర్న్ ఎంపికను ఎంచుకోవాలి

Step 3: పాన్, అసెస్‌మెంట్ సంవత్సరం, అక్నాల్డెజ్ మెంట్ సంఖ్య, మొబైల్ నంబర్ వంటి అన్ని వివరాలను నమోదు చేసి.. Continue క్లిక్ చేయండి

Step 4: జనరేట్  ఆధార్ ను ఎంపిక చేసుకోవటం ద్వారా OTPని మొబైల్ నంబర్‌కు వస్తుంది

Step 5: 6-అంకెల OTPని ఎంటర్ చేయాలి. ఈ OTP 15 నిమిషాలు మాత్రమే చెల్లుబాటు అవుతుంది.

Step 6: ఇప్పుడు మీరు “success message” తో లావాదేవీ IDని పొందుతారు. తర్వాత మీ నమోదిత ఈమెయిల్, మొబైల్ నంబర్‌కు నిర్ధారణ సందేశం కూడా పంపబడుతుంది. ఇలా మీరు ఆధార్ కార్డును వినియోగించుకుని ITRని ఈ-ధృవీకరణ ప్రక్రియను పూర్తిచేయవచ్చు.

ఇవీ చదవండి..

Anand Mahindra: ట్విట్టర్ వీడియోపై స్పందించిన మహీంద్రా.. వాట్ ఏ ఐడియా సర్జీ అంటూ కితాబు..

Stock Market: లాభాల్లో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు.. సెన్సెక్స్ 248, నిఫ్టీ 74 పాయింట్లు అప్..