AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anand Mahindra: ట్విట్టర్ వీడియోపై స్పందించిన మహీంద్రా.. వాట్ ఏ ఐడియా సర్జీ అంటూ కితాబు..

Anand Mahindra: నూతన సాంకేతిక పరిజ్ఞానం, కొత్త తరం ఆలోచనలపై మక్కువ చూపించే మహీంద్రా గ్రూప్ ఛైర్‌పర్సన్ ఆనంద్ మహీంద్రా తాజాగా మరో ట్వీట్ చేశారు.

Anand Mahindra: ట్విట్టర్ వీడియోపై స్పందించిన మహీంద్రా.. వాట్ ఏ ఐడియా సర్జీ అంటూ కితాబు..
Anand Mahindra
Ayyappa Mamidi
|

Updated on: Mar 03, 2022 | 9:41 AM

Share

Anand Mahindra: నూతన సాంకేతిక పరిజ్ఞానం, కొత్త తరం ఆలోచనలపై మక్కువ చూపించే మహీంద్రా గ్రూప్ ఛైర్‌పర్సన్ ఆనంద్ మహీంద్రా తాజాగా మరో ట్వీట్ చేశారు. ఈ సారి దేశవ్యాప్తంగా సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసే ప్యానెల్స్ విస్తృతిని పెంచటానికి భారత్ చేస్తు్న్న ప్రయత్నాల గురించి మాట్లాడారు. దక్షిణ కొరియాలోని హైవే మధ్యలో ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెల్స్ ను గురించి వివరిస్తూ.. గ్రీన్ బెల్ట్ & రోడ్ ఇన్స్టిట్యూట్ ప్రెసిడెంట్ ఎరిక్ సోల్హీమ్ ట్విట్లర్ లో షేర్ చేసిన వీడియోను ఆనంద్ మహీంద్రా రీట్వీట్ చేశారు.

సోల్‌హీమ్ చేసిన ట్వీట్‌కి ఆశ్చర్యపోతూ.. మహీంద్రా ఇలా స్పందించారు. “వాట్ ఏ ఐడియా సర్జీ.. మేము భారత్ లో కాలువలపై సోలార్ ప్యానెల్స్ ను ఏర్పాటు చేస్తున్నాము. అయితే ఇది కవరేజీని గణనీయంగా పెంచుతుంది. సైక్లిస్టులు ఎక్స్‌ప్రెస్‌వేలను వినియోగించనప్పటికీ ఇది చూడటం విలువైనదే.. బహుశా ఇది వినోదాత్మక సైక్లింగ్ బూమ్‌కు దారి తీయవచ్చు” అంటూ కామెంట్ చేశారు. తన ట్వీట్‌లో కేంద్ర రోడ్డు రవాణా & రహదారుల మంత్రి నితిన్ గడ్కరీని మహీంద్రా ట్యాగ్ చేశాడు.

మహీంద్రా తన ట్విటర్ ఫాలోవర్లలో ఒకరైన కిరణ్ హన్సోటియా కామెంట్ పై కూడా స్పందించారు. “సైక్లిస్టులను మరచిపోండి, దీనిని ద్విచక్రవాహనాలకు సురక్షితమైన మార్గంగా మార్చవచ్చు! హైవే ప్రయాణాలు అప్పుడు చాలా సురక్షితంగా ఉంటాయి!” అని కామెంట్ చేశారు. ఈ కామెంట్ పై ఆనంద్ మహీంద్రా.. ఇది “మంచి పాయింట్” అంటూ ప్రతిస్పందించారు.

ఇవీ చదవండి..

Edible Oils Prices: హోలీకి ముందే జేబు ఖాలీ..! భారీగా పెరిగిన వంట నూనె ధరలు..

Banking News: ఆ బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త.. FD వడ్డీ రేట్ల పెంపు.. సీనియర్ సిటిజన్లకు ఎంతంటే..