AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Banking News: ఆ బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త.. FD వడ్డీ రేట్ల పెంపు.. సీనియర్ సిటిజన్లకు ఎంతంటే..

Interest Rate Hike: బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్(FD Rates) పెట్టుబడులకు మరో శుభవార్త. వడ్డీ రేటును పెంచినట్లు ప్రభుత్వరంగానికి చెందిన బ్యాంకింగ్ దిగ్గజం వెల్లడించింది. సీనియర్ సిటిజన్లకు భారీగా రేటు పెంపును ప్రకటించింది.

Banking News: ఆ బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త.. FD వడ్డీ రేట్ల పెంపు.. సీనియర్ సిటిజన్లకు ఎంతంటే..
Canara bank fd rates
Ayyappa Mamidi
|

Updated on: Mar 03, 2022 | 8:36 AM

Share

Interest Rate Hike: బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్(FD Rates) పెట్టుబడులకు మరో శుభవార్త. వడ్డీ రేటును పెంచినట్లు ప్రభుత్వరంగానికి చెందిన కెనరా బ్యాంక్(Canara Bank) వెల్లడించింది. ఎఫ్ డి లపై 25 బేసిక్ పాయింట్లు లేదా 0.25 శాతం వడ్డీని పెంచినట్లు తాజాగా వెల్లడించింది. కొత్త వడ్డీ రేట్లు మార్చి 1, 2022 నుంచి అమలులోకి వస్తాయని అధికారిక ప్రకటనలో దేశంలోని మూడవ అతిపెద్ద జాతీయ బ్యాంకు ప్రకటించింది. రూ. 2 కోట్ల కంటే తక్కువ ఫిక్స్‌డ్ డిపాజిట్ పెట్టుబడులపై ఈ పెంచిన వడ్డీ రేట్లు వర్తిస్తాయని పేర్కొంది. కెనరా బ్యాంక్ కంటే ముందు అనేక ఇతర ప్రభుత్వ యాజమాన్యంలోని, ప్రైవేట్ బ్యాంకులు కూడా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచాయి. ఈ బ్యాంకుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB), HDFC బ్యాంక్, ICICI బ్యాంకులు ఉన్నాయి.

7 రోజుల నుంచి 45 రోజుల కాల వ్యవధిలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్ ఇన్వెస్ట్‌మెంట్‌లకు పెట్టుబడిదారులు 2.90% వడ్డీని అందుకుంటారు. 46 రోజుల నుంచి 90 రోజుల్లో మెచ్యూర్ అయ్యే ఎఫ్ డి పెట్టుబడులపై బ్యాంక్ 3.90% వడ్డీ రేటును అందిస్తుంది. అంతేకాకుండా.. కెనరా బ్యాంక్ 180 రోజులు లేదా అంతకంటే తక్కువ మెచ్యూరిటీ వ్యవధి కలిగిన ఎఫ్ డి లకు 4.40% వడ్డీ రేటును అందిస్తుంది. అలాగే కస్టమర్లు 2-3 సంవత్సరాల కాల వ్యవధితో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 5.20 శాతం వడ్డీ రేటును పొందవచ్చు.

కెనరా బ్యాంక్ 2 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం మెచ్యూర్ అయ్యే 3 సంవత్సరాల కంటే తక్కువ FDలపై 5.20% వడ్డీ రేటును అందిస్తోంది. అలాగే కస్టమర్‌లు 3 సంవత్సరాల కంటే ఎక్కువ, 5 సంవత్సరాల కంటే తక్కువ కాల వ్యవధి ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లకు 5.25 శాతానికి బదులుగా.. 5.45 శాతం వడ్డీ రేటు లభించనుంది. సీనియర్ సిటిజన్లు ఫిక్స్‌డ్ డిపాజిట్ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై అధిక వడ్డీ రేటును స్వీకరిస్తూనే ఉంటారని బ్యాంక్ ప్రకటించింది. సీనియర్ సిటిజన్లు చేసే పెట్టుబడులపై బ్యాంక్ 50 బేసిస్ పాయింట్లు లేదా 0.5% అధిక వడ్డీ రేటును అందిస్తోంది.

ఇవీ చదవండి..

Rakesh Jhunjhunwala: 6 నెలల్లో 40 శాతం పెరిగిన షేరు.. కొత్తగా 11 లక్షల షేర్లు కొన్న రాకేశ్ జున్‌జున్‌వాలా..

Gold Silver Price Today: మగువలకు బ్యాడ్‌న్యూస్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో