AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Petrol Diesel Price: ముడి చమురు ధరలో భారీ పెరుగుదల.. దేశవ్యాప్తంగా స్థిరంగా ఉన్నా.. మన నగరంలో పెట్రోల్, డీజిల్ ధరల్లో మాత్రం..

రష్యా -ఉక్రెయిన్ మధ్య యుద్దం నేపథ్యంలో ముడి చమురు ధరలు వేగంగా పెరుగుతున్నాయి. మార్చి 3, గురువారం అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 118 డాలర్లకు చేరుకున్నాయి. పెరుగుతున్న ముడి చమురు..

Petrol Diesel Price: ముడి చమురు ధరలో భారీ పెరుగుదల.. దేశవ్యాప్తంగా స్థిరంగా ఉన్నా.. మన నగరంలో పెట్రోల్, డీజిల్ ధరల్లో మాత్రం..
Petrol Diesel Prices
Sanjay Kasula
| Edited By: |

Updated on: Mar 03, 2022 | 12:13 PM

Share

రష్యా -ఉక్రెయిన్ మధ్య యుద్దం నేపథ్యంలో ముడి చమురు ధరలు వేగంగా పెరుగుతున్నాయి. మార్చి 3, గురువారం అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 118 డాలర్లకు చేరుకున్నాయి. పెరుగుతున్న ముడి చమురు ధరలు ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. చమురు ధరల పెరుగుదల నేరుగా దేశంలోని సాధారణ ప్రజలపై ప్రభావం చూపుతుంది. మార్చి 7న ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలు ముగిసిన తర్వాత, ప్రభుత్వం దేశవ్యాప్తంగా పెట్రోల్ – డీజిల్ ధరలను పెంచడం ప్రారంభిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మీడియా నివేదికల ప్రకారం, ఎన్నికలు ముగిసిన తర్వాత, దేశవ్యాప్తంగా ఇంధన ధరలను లీటరుకు రూ.9 వరకు పెంచవచ్చు.

దేశవ్యాప్తంగా 4 నెలలుగా పెట్రోలు, డీజిల్ ధరలు ..

మరోవైపు, దేశంలోని ప్రముఖ చమురు కంపెనీలు మార్చి 3, గురువారం కొత్త పెట్రోల్ మరియు డీజిల్ ధరలను విడుదల చేశాయి. నేటికీ దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. దేశంలో పెట్రోలు మరియు డీజిల్ ధరలలో ఎలాంటి మార్పు రావడానికి 120 రోజులు (4 నెలలు) అని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. దేశంలో చమురు ధరలు చివరిగా నవంబర్ 4, 2021న మార్చబడ్డాయి.

తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. 

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.20గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.94.62గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.25గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.94.65గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 108.94గా ఉండగా.. డీజిల్ ధర రూ.95.86గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.55గా ఉండగా.. డీజిల్ ధర రూ.95.71గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.62 ఉండగా.. డీజిల్ ధర రూ.95.01గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.69 పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.94.14గా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. 

విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.110.51కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.59లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.109.47 ఉండగా.. డీజిల్ ధర రూ. 95.83గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.51 లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.96.84గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 109.91గా ఉండగా.. డీజిల్ ధర రూ.96.03గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ.110.51లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.96.59లకు లభిస్తోంది.

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ.95.41 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 86.67 లకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.98కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.94.14 ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.104.67 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 89.79 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 101.40 ఉండగా.. డీజిల్ ధర రూ.91.43గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.100.58 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.85.01గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 95.14 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.86.68గా ఉంది.

ఇవి కూడా చదవండి: Russia-Ukraine War: ఫైటింగ్ స్టైయిల్ మార్చిన ఉక్రెయిన్ యువత.. రష్యన్‌ దళాలపై పెట్రోల్‌ బాంబులతో దాడి.. 

'నా నడుముపై చేయి వేసి'.. బిగ్ బాస్ తెలుగు బ్యూటీకి చేదు అనుభవం
'నా నడుముపై చేయి వేసి'.. బిగ్ బాస్ తెలుగు బ్యూటీకి చేదు అనుభవం
షుగ‌ర్ ఉన్న‌వారు సపోటా తింటే ఏమౌతుందో తెలుసా? డాక్టర్స్‌ చెప్పేది
షుగ‌ర్ ఉన్న‌వారు సపోటా తింటే ఏమౌతుందో తెలుసా? డాక్టర్స్‌ చెప్పేది
అరటి పండు Vs జామ పండు: ఉదయాన్నే ఏది తింటే ఆరోగ్యానికి మంచిది..?
అరటి పండు Vs జామ పండు: ఉదయాన్నే ఏది తింటే ఆరోగ్యానికి మంచిది..?
ఇన్నాళ్లు తమ పొట్ట నింపిన తాటి చెట్టు పైనుంచే.. అనంత లోకాలకు
ఇన్నాళ్లు తమ పొట్ట నింపిన తాటి చెట్టు పైనుంచే.. అనంత లోకాలకు
తొలి మ్యాచ్‌కు ముందే దిమ్మతిరిగే షాక్.. ఆడకుండానే పాక్ ఔట్..?
తొలి మ్యాచ్‌కు ముందే దిమ్మతిరిగే షాక్.. ఆడకుండానే పాక్ ఔట్..?
జియో హాట్ స్టార్‌ను వదలని ప్రభాస్ ఫ్యాన్స్..!
జియో హాట్ స్టార్‌ను వదలని ప్రభాస్ ఫ్యాన్స్..!
ఫోన్‌లో స్టోరేజ్‌ ఫుల్‌ అయిందా? ఇలా చేయండి 2TB ఫ్రీ
ఫోన్‌లో స్టోరేజ్‌ ఫుల్‌ అయిందా? ఇలా చేయండి 2TB ఫ్రీ
శని, శుక్ర సంయోగం.. వీరికి అలర్ట్.. మొండితనం విడిచి పెట్టాల్సిందే
శని, శుక్ర సంయోగం.. వీరికి అలర్ట్.. మొండితనం విడిచి పెట్టాల్సిందే
భారత్ - అమెరికా చారిత్రాత్మక ఒప్పందం.. మన రైతులకు, వ్యాపారులకు..
భారత్ - అమెరికా చారిత్రాత్మక ఒప్పందం.. మన రైతులకు, వ్యాపారులకు..
టీ20 ప్రపంచ కప్ ప్రారంభోత్సవ వేడుకలో తళుక్కున మెరవనున్న తారలు..
టీ20 ప్రపంచ కప్ ప్రారంభోత్సవ వేడుకలో తళుక్కున మెరవనున్న తారలు..