Viral News: విదేశీ జైళ్లలో భారతీయ ఖైదీలు.! ఎంతమంది ఉన్నారో తెలిస్తే షాకే!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు విదేశీ జైళ్లలో భారతీయులు శిక్షను అనుభవిస్తున్న సంగతి మీకు తెలుసా.? ఇక వారిలో కొంతమందిపై..

Viral News: విదేశీ జైళ్లలో భారతీయ ఖైదీలు.! ఎంతమంది ఉన్నారో తెలిస్తే షాకే!
Prisoners
Follow us
Ravi Kiran

|

Updated on: Mar 03, 2022 | 2:01 PM

ఉన్నత విద్య, ఉద్యోగం కోసం భారతీయులు తరచూ విదేశాలకు వెళ్తుంటారు. అందులో కొంతమంది మంచి ఉద్యోగాలు చేస్తూ అక్కడే సెటిల్ కాగా.. మరికొందరు కూలీ పని, పెట్రోల్ బంకుల్లో, సూపర్ మార్కెట్‌లలో హెల్పర్లుగా చేరి తమ జీవనాన్ని కొనసాగిస్తుంటారు. ఇదిలా ఉంటే.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు విదేశీ జైళ్లలో భారతీయులు శిక్షను అనుభవిస్తున్న సంగతి మీకు తెలుసా.? ఇక వారిలో కొంతమందిపై నేరం నిజనిర్ధారణ కూడా కాలేదు. అంతేకాకుండా వారు చాలాకాలంగా ఆయా జైళ్లలో శిక్షను అనుభవిస్తున్నారు. మరి అసలు విదేశీ జైళ్లలో భారతీయులు ఎంతమంది ఉన్నారో.? వారి కోసం ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోందో ఇప్పుడు చూద్దాం..

ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రచురించిన కథనం ప్రకారం.. విదేశీ జైళ్లలో 7925 మంది భారతీయులు ఖైదీలుగా మగ్గుతున్నట్లు తేలింది. ఇందులో అత్యధికంగా యూఏఈలో 1663 మంది ఉండగా.. ఆ తర్వాత సౌదీ అరేబియాలో 1363 మంది, నేపాల్‌లో 1039 మంది, ఖతర్‌లో 466 మంది, యూకేలో 373 మంది, అమెరికాలో 254 మంది భారతీయులు ఖైదీలుగా ఉన్నారు.

ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి. మురళీధరన్ మాట్లాడుతూ.. శిక్ష పడిన భారతీయులను బదిలీ చేయడానికి 35 దేశాలతో భారతదేశం ఒప్పందాలపై సంతకం చేసిందన్నారు. ఈ ఒప్పందం ప్రకారం విదేశీ జైళ్లలో మగ్గుతున్న భారతీయులను తిరిగి స్వదేశానికి తీసుకురావచ్చునని.. అయితే ఆయా దేశాల్లో మరణ శిక్ష అనుభవిస్తున్న భారతీయులకు మాత్రం ఇది వర్తించదని అన్నారు. అలాగే జనవరి 2006 నుంచి జనవరి 2022 వరకు, దాదాపు 75 మంది భారతీయ ఖైదీలు రిపాట్రియేషన్ ఆఫ్ ఖైదీల చట్టం, 2003 ప్రకారం మిగిలిన శిక్షను అనుభవించేందుకు బదిలీ చేయబడ్డారని తెలిపారు. మరోవైపు అత్యధిక సంఖ్యలో భారతీయ ఖైదీలు ఉన్న ఇతర దేశాల లిస్టు ఇలా ఉంది.. పాకిస్థాన్ 628, ఖతార్ 466, కువైట్ 460 మరియు మలేషియా 290, శ్రీలంకలో 76 మంది ఉన్నారు.

వారి కోసం ప్రభుత్వం ఏం చేస్తుంది?

విదేశీ జైళ్లలో ఉన్న భారతీయులతో పాటు విదేశాల్లో ఉన్న భారతీయుల భద్రత, సంక్షేమం కోసం కేంద్రం తగినంత ప్రాధాన్యత తీసుకుంటోంది. ప్రాధాన్యత ఇస్తుంది. విదేశీ జైళ్లలో ఉన్న భారతీయుల కదలికలను వివిధ దేశాల్లోని భారత రాయబార కార్యాలయాల్లో ఉన్న అధికారులు నిశితంగాగా పర్యవేక్షిస్తుంటారు. అక్కడ స్థానికంగా ఉండే న్యాయవాదులు కూడా ఎప్పటికప్పుడు న్యాయ సలహాలు ఇస్తుంటారు.

విదేశాల్లో ఎంత మంది విద్యార్థులు ఉన్నారు?

ఉక్రెయిన్, బల్గేరియా, మొజాంబిక్, పాకిస్థాన్ వంటి అనేక దేశాలతో సహా దాదాపు 99 దేశాల్లో భారతీయ విద్యార్థులు ఉన్నత చదువును అభ్యసిస్తున్నారు. గత ఏడాది జూలైలో విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇచ్చిన సమాచారం ప్రకారం.. 11,33,749 మంది విద్యార్థులు విదేశాల్లో చదువుతున్నారు. ఈ డేటా దాదాపు 6 నెలల క్రితం నాటిది. కాబట్టి ఈ రోజు ప్రకారం చూసుకుంటే ఇందులో స్వల్ప మార్పు ఉండొచ్చు. మీరు దేశాల వారీగా డేటాను పరిశీలిస్తే, UAEలో అత్యధికంగా 2,19,000 మంది విద్యార్దులు చదువుతున్నారు. అమెరికాలో 2,11,930 మంది.. కెనడాలో 2,15,720 మంది ఉన్నారు.