Notice To AP Ministers: ఏపీ మంత్రులకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు.. లేఖల లీకేజీ వ్యవహారంలో నిమ్మగడ్డ పిటిషన్‌పై..
High Court Notice To AP Ministers: ఆంధ్రప్రదేశ్ మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గవర్నర్‌కు రాసిన లేఖల లీకేజీ వ్యవహారంలో ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వేసిన..
High Court Notice To AP Ministers: ఆంధ్రప్రదేశ్ మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గవర్నర్‌కు రాసిన లేఖల లీకేజీ వ్యవహారంలో ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ఇద్దరు మంత్రులకు నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణను వచ్చే మంగళవారంకు వాయిదా వేసింది. గవర్నర్‌తో తాను జరుపుతున్న ఉత్తర ప్రత్యుత్తరాలు అన్నీ బయటకు లీకవుతుండటంపై విచారణ జరపాలని నిమ్మగడ్డ పిటిషన్ వేశారు. సీబీఐతో విచారణ జరిపించాలని.. తాను గవర్నర్‌కు రాస్తున్న ప్రివిలేజ్ లెటర్స్ అన్నీ ఆఫీస్ నుంచి ఎలా బయటకు వస్తున్నాయో తేల్చాలన్నారు. ఈ క్రమంలో నిమ్మగడ్డ పిటిషన్‌లో పలు విషయాలను ప్రస్తావించారు. తాను గవర్నర్‌కు రాసిన లేఖల్ని సోషల్ మీడియాలో చూశామని మంత్రులు చెబుతున్నారని చెప్పుకొచ్చారు. ఈ విషయం బయటకు ఎలా వచ్చిందో విచారణ జరపాలని నిమ్మగడ్డ కోరారు. ఈ క్రమంలో గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ, సీఎస్ మంత్రులు పెద్దిరెడ్డి, బొత్సలను ప్రతివాదులుగా చేర్చారు. ఇందులో భాగంగా జరిగిన విచారణలోనే ఇద్దరు మంత్రులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
హైకోర్టు నోటీసులపై స్పందించిన మంత్రి బోత్స..
హైకోర్టు ఇచ్చిన నోటీసులపై మంత్రి బోత్స సత్యనారాయణ స్పందించారు. నోటీసులు ఇచ్చిన విషయం ఇప్పుడే తెలిసిందన్న మంత్రి.. కోర్టు ఆదేశాలు తప్పకుండా పాటిస్తామని చెప్పారు. కోర్టు ఇచ్చిన నోటీసుకు సమాధానం ఇస్తామని బొత్స చెప్పుకొచ్చారు.
Also Read: Suicide: రైలు పట్టాలపై యువతి, యువకుడు ఆత్మహత్య.. ప్రేమ జంటగా అనుమానిస్తున్న రైల్వే పోలీసులు