Tirupati: తిరుపతిలో విమానాల మరమ్మతు కేంద్రం ఏర్పాటుకు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రయత్నాలు
Tirupati: ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) తిరుపతిలో విమానాల మరమ్మతు కేంద్రాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది.
Tirupati: ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) తిరుపతిలో విమానాల మరమ్మతు కేంద్రాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. స్థలాన్ని గుర్తించే పనిలో ఉన్నట్లు సంబంధిత వర్గాల ద్వారా సమాచారం. ఆ తర్వాత బిడ్లను ఆహ్వానించే వీలుంటుంది. మరో వైపు రెండు విమినాశ్రయాల్లో కూడా విమాన మరమ్మతు, నిర్వహణ కేంద్రాలను ఏఏఐ ఏర్పాటు చేసే ప్రక్రియలో ఉంది. ప్రస్తుతం 85 శాతం విమాన మరమ్మతు పనులు దేశానికి బయటే కొనసాగుతున్నాయి.
మరమ్మత్తు కోసం విమానాలు యూఏఈ, సింగపూర్, అమెరికా తదితర దేశాలకు వెళ్తున్నాయి.ఇక దేశీయ విమానయాన సంస్థలు మరమ్మత్తులపై ఏడాదికి బిలియన్ డాలర్లకు పైనే అన్వెస్ట్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో విమాన మరమ్మత్తులకు భారత్‌ను కేంద్రం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇతర దేశాల విమానాలు కూడా భారత్‌కు వచ్చేలా ఎంఆర్‌ఓ పరిశ్రమను అభివృద్ధి చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎంఆర్‌ఓ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.ఈ విమానా మరమ్మతు కేంద్రం ఏర్పాటు అయినట్లయితే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.