West Bengal Elections 2021: పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల్లో బీజేపీ దూకుడు … అధికారం కోసం సుడిగాలి పర్యటనలు

West Bengal Elections 2021: బెంగాల్‌ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. బెంగాల్‌లో ఎనిమిది దశల్లో ఎన్నికల నిర్వహణ నిర్వహిచనున్నారు.

West Bengal Elections 2021: పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల్లో బీజేపీ దూకుడు ... అధికారం కోసం సుడిగాలి పర్యటనలు
Amit Shah
Follow us
Subhash Goud

|

Updated on: Mar 23, 2021 | 2:36 PM

West Bengal Elections 2021: బెంగాల్‌ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. బెంగాల్‌లో ఎనిమిది దశల్లో ఎన్నికల నిర్వహణ నిర్వహిచనున్నారు. మరోపక్క బీజేపీ దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. కమ్యూనిస్టుల స్ధానంలో అధికారంలోకి వచ్చిన మమత… తన స్థానాన్ని సుస్ధిరం చేసుకుంటూ ఇప్పటికే రెండుసార్లు సీఎం కాగలిగారు. ఈసారి హ్యాట్రిక్ కొట్టే ప్రయత్నంలో మాత్రం బీజేపీ నుంచి గట్టిపోటీ ఇచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇక ప్రధాని నరేంద్ర మోదీ , అమిత్‌ షాలు, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా వంటి ప్రముఖులు పశ్చిమబెంగాల్‌ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.

రాష్ట్రంలో బీజేపీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది. అయితే టెరాయ్‌, డూయర్స్‌ పర్వత ప్రాంతాలతో సహా ఉత్తరాన ఉన్న పర్వత ప్రాంతం డార్జింగ్‌, కాలింపాంగ్‌, అలీపుర్దువార్‌ తదితర ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. ఉత్తర బెంగాల్‌ ప్రాంతాలు, ఇందులో ఉత్తర దినజ్‌పూర్‌, దక్షణి దినజ్‌పూర్‌, మల్డా, ముర్షిదాబాద్‌, బీర్‌భూమ్‌లున్నాయి. అయితే దక్షిణ బెంగాల్‌ జిల్లాలు నాడియా, తూర్పు బుర్ద్వాన్, పశ్చిమ బుర్ద్వాన్, హూగ్లీ మరియు ఉత్తర 24 పరగణాల జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి, ఇక్కడ దక్షిణ బెంగాల్‌లో భారతీయ జనతా పారట్ఈ మెరుగైన స్థితిలో ఉంది.

కాగా, పర్వత ప్రాంతంలో మరియు ఉత్తరాన పర్వత ప్రాంతంలో 27 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. అయితే, 2016 లో బీజేపీ మిత్రపక్షంగా ఉన్న గూర్ఖా జన్ముక్తి మోర్చా గత అసెంబ్లీ ఎన్నికల్లో మూడు స్థానాలను గెలుచుకుంది. అయితే పశ్చిమబెంగాల్‌లో ముస్లింల ఓటర్లు అధికంగా ఉన్నాయి. వారిని బీజేపీ వైపు తిప్పుకునేందుకు నేతలు తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పలు హామీలు ఇస్తూ ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు బీజేపీ తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తోంది. అలాగే కూచ్‌ బెహర్లో ముస్లింల జనాభా 24 శాతం ఉంది. అయితే యువతకు ఉపాధి కల్పించే దిశగా పారా మిలటరీ దళాల్లో నారాయణసేన బెటాలియన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఇప్పటికే బీజేపీ ప్రకటించింది. మహిళలు, పిల్లలకు, విద్యార్థులకు వివిధ పథకాల కోసం వచ్చే ఏడాది కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన వేల కోట్ల నిధులను బెంగాల్‌కు కేటాయిస్తూ ప్రయోజనం చేకూర్చేలా నిర్ణయం తీసుకుంటోంది. ఇక ఉత్తర బెంగాల్‌లోని ఉత్తర దినజ్‌పూర్‌, దక్షిణ దినజ్‌పూర్‌, మాల్డా, ముర్షిదాబాద్, బీర్‌భూమ్‌లలో ఉన్న సీట్లను కైవసం చేసుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తోంది.

ఈ ప్రాంతాలలో జనాభాలో గణనీయమైన ముస్లిం వాటా ఉంది. ముర్షిదాబాద్‌లో 66%, మాల్డాలో 50%, ఉత్తర దినజ్‌పూర్, బిర్భూమ్ 37%, దక్షిణ దినజ్‌పూర్ జిల్లాలో 15% ఉన్నాయి. ఈ ముస్లిం ఓటర్లను కైవసం చేసుకునేందుకు పలు హామీలు ఇస్తోంది బీజేపీ. అయితే 2019లో క్‌సభ ఎన్నికల్లో 74 సీట్లలో బీజేపీ ఆరు మాత్రమే దక్కించుకుంది. ఈ జిల్లాల నుంచి బీజేపీ అధిక సీట్లను దక్కించుకునేందుకు ప్రయత్నాలను కొనసాగిస్తోంది. అయితే ఈ ప్రాంతంలో అధికార పార్టీ తృణమూల్‌ కాంగ్రెస్‌ మరింత దూకుడు పెంచింది. అయితే రాష్ట్రంలో ఇటీవల చోటు చేసుకున్న తుఫాను కారణంగా ఆర్థిక సాయం పంపిణీలో చోటు చేసుకున్న అక్రమాలపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. జరిగిన అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్తూ ఓట్లు సాధించుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇక బంగ్లా దేశ్‌ నుంచి ఎక్కువ వలస వచ్చిన వారు చాలా మంది ఉన్నారు. వీరిపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారిస్తోంది.

బెంగాల్‌ రాజకీయ చరిత్రను పరిశీలిస్తే..

2019 ప్రారంభం వరకు బెంగాల్‌లో పాలన సాగించడం బీజేపీకి కల. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో మొత్తం 294 సీట్లలో బీజేపీకి కేవలం మూడు సీట్లు మాత్రమే వచ్చాయి, అది అప్పటి వరకు అత్యధికంగా ఉంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి విజయవంతం కాలేదు రాష్ట్రంలోని మొత్తం 42 లోక్‌సభ స్థానాల్లో 18 స్థానాల్లో గెలిచింది. మొత్తం ఓట్లలో బీజేపీ 40.64% వాటాను కలిగి ఉంది, అయినప్పటికీ టిఎంసి కూడా 22 సీట్లు గెలుచుకుంది. దాని ఓటు శాతం 45.69%, అయితే అంతకుముందు పోలిస్తే సీట్ల సంఖ్య తగ్గింది. 2021 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అటువంటి సమయంలో బెంగాల్ ముస్లిం ఓటర్లు ఏ పార్టీకి మద్దతు ఇస్తారనేది సందిగ్ధంగా మారింది. లోక్‌సభ ఎన్నికల తరువాత, బెంగాల్‌లో అధికారం కోసం బీజేపీ బలమైన పోటీదారుగా అవతరించింది. అటువంటి పరిస్థితిలో, ముస్లిం ఓట్లు చాలా ముఖ్యమైనవి. ఇప్పటివరకు బీజేపీ, టిఎంసిల మధ్య పోటీ బెంగాల్‌లో పరిగణించబడుతున్నప్పటికీ, బెంగాల్ రాజకీయాల్లో ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్) ప్రవేశం ఎన్నికల సమీకరణాన్ని క్లిష్టతరం చేసింది. ఐఎస్‌ఎఫ్ లెఫ్ట్ ఫ్రంట్, కాంగ్రెస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.

2011 జనాభా లెక్కల ప్రకారం

పశ్చిమ బెంగాల్‌లోని ముస్లిం ఓటర్లు సంప్రదాయకంగా అధికార పార్టీకి ఎల్లప్పుడూ మద్దతు ఇచ్చే సామాజిక వర్గంగా భావిస్తారు. 2011 జనాభా లెక్కల ప్రకారం.. పశ్చిమ బెంగాల్‌లో ఈ జనాభా 27.01%, ఇది మొత్తం దేశంలో మూడో స్థానంలో ఉంది. ముస్లిం జనాభా విషయానికొస్తే, జమ్మూ కాశ్మీర్ (68.31%) మొదటి, అస్సాం (34.22%) రెండో స్థానంలో ఉన్నాయి. 1977లో పశ్చిమ బెంగాల్‌లో లెఫ్ట్ ఫ్రంట్ కాంగ్రెస్‌ను ఓడించి అధికారాన్ని కైవసం చేసుకుంది. 1977 నుంచి 2006 వరకు ముస్లిం ఓటర్లు బహిరంగంగా వామపక్షానికి మద్దతు ఇచ్చారు, కానీ 2008 పంచాయతీ ఎన్నికల తరువాత ఈ ధోరణి ఆగిపోయింది. ముస్లిం ఓటర్లు మమతా బెనర్జీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) వైపు మొగ్గు చూపడం ప్రారంభించారు. చివరకు లెఫ్ట్ ఫ్రంట్ పాలనతో 2011 సంవత్సరం ముగిసింది. మమతా బెనర్జీ నాయకత్వంలో బెంగాల్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఈ ప్రభుత్వం ఏర్పాటులో ముస్లిం ఓటర్లు మమతా బెనర్జీకి బహిరంగంగా మద్దతు ఇచ్చారు.

బీజేపీ, టీఎంసీల హోరాహోరీగా ప్రచారం

పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరుకుంది. బీజేపీ, టీఎంసీ హోరాహోరీగా ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. బీజేపీ తరపున ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాతో పాటు బీజేపీ చీఫ్ జేపీ పడ్డా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. పీఎం కిసాన్ యోజన, కేజీ టూ పీజీ విద్య, ఎయిమ్స్, సీఏఏతో పాటు బెంగాల్ ప్రజలపై హామీల వర్షం కురిపించారు. ఎన్నికల్లో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా బీజేపీ మేనిఫెస్టోను ప్రకటించారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ.. తాము అధికారంలోకి వస్తే.. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఇంటికో ఉద్యోగం ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏడో వేతన సంఘం సిఫారసులను అమలు చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది. 75 లక్షల మంది రైతులకు పీఎం కిసాన్ కింద ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించింది. అలాగే జంగిల్ మహల్, సుందర్బన్, నార్త్ బెంగాల్‌లలో మూడు ఎయిమ్స్‌లు ఏర్పాటు చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. అలాగే రాష్ట్రంలోని మత్స్యకారులకు ఏటా రూ.6 వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని బీజేపీ తన మేనిఫెస్టోలో ప్రకటించారు.

ప్రకంపనలు సృష్టిస్తున్న మహారాష్ట్ర పోలీసు బదిలీల వ్యవహారం.. హోంమంత్రిని బర్తరఫ్ చేయాలని మాజీసీఎం ఫడ్నవీస్ డిమాండ్

బెంగాల్ ఎన్నికలు, మొదటి దశలో 5 జిల్లాల్లో 30 సీట్లకు పోలింగ్, ఎవరెక్కడి నుంచి పోటీ ?

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!