ప్రకంపనలు సృష్టిస్తున్న మహారాష్ట్ర పోలీసు బదిలీల వ్యవహారం.. హోంమంత్రిని బర్తరఫ్ చేయాలని మాజీసీఎం ఫడ్నవీస్ డిమాండ్

మహారాష్ట్ర హోంమంత్రి, ఎన్సీపీ నేత అనిల్‌ దేశ్‌ముఖ్‌పై ముంబై మాజీ సీపీ పరమ్‌బీర్‌ సింగ్‌ చేసిన అవినీతి ఆరోపణలు మహారాష్ట్రలో ప్రకంపనలు సృష్టిస్తోంది.

ప్రకంపనలు సృష్టిస్తున్న మహారాష్ట్ర పోలీసు బదిలీల వ్యవహారం.. హోంమంత్రిని బర్తరఫ్ చేయాలని మాజీసీఎం ఫడ్నవీస్ డిమాండ్
Devendra Fadnavis
Follow us
Balaraju Goud

|

Updated on: Mar 23, 2021 | 2:11 PM

Devendra Fadnavis : మహారాష్ట్ర హోంమంత్రి, ఎన్సీపీ నేత అనిల్‌ దేశ్‌ముఖ్‌పై ముంబై మాజీ సీపీ పరమ్‌బీర్‌ సింగ్‌ చేసిన అవినీతి ఆరోపణలు మహారాష్ట్రలో ప్రకంపనలు సృష్టిస్తోంది. పోలీసు బదిలీలలో భారీ అవినీతి జరిగిందని, పోలీసు వ్యవస్థలో చుట్టూ బ్రోకర్లు ఉన్నారని, పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారుతోందని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆరోపించారు.

హోంమంత్రిని రక్షించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నం బహిర్గతమైందని ఆరోపించారు. ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ సోమవారం విలేకరుల సమావేశంలో ఉంచిన అలీబిలో ఉన్న వ్యత్యాసాలను మరోసారి ఎత్తిచూపారు. అనిల్ దేశ్ ముఖ్ ఫిబ్రవరి 17 న ముంబైలోని సహ్యాద్రి గెస్ట్ హౌస్ మంతనాలు జరిపారని అనంతరం ఫిబ్రవరి 24 న సెక్రటేరియట్ వెళ్లారని ప్రతిపక్ష నాయకుడు ఫడ్నవిస్ ఆరోపించారు. జాతీయ నాయకుడు అయిన శరద్ పవార్ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేయవద్దని ఫడ్నవీస్ ఫైరయ్యారు. అనిల్ దేశ్‌ముఖ్ కరోనాతో నిర్బంధంలో ఉన్నమాట అవాస్తమన్నారు.

పోలీసుల బదిలీలు, పోస్టింగ్‌లలో పెద్ద ఎత్తున అవినీతికి సంబంధించిన ఆడియో టేపులతో ఆధారాలతో బయటపెట్టిన రాష్ట్ర ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్ నివేదికపై మహారాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకోలేదని ఫడ్నవీస్ ధ్వజమెత్తారు.

పోలీస్ ఫోర్స్‌లో అనుకూలమైన బదిలీల కోసం లంచం రాకెట్లపై మాజీ డైరెక్టర్ జనరల్ పోలీస్ సుబోద్ జైస్వాల్ గతంలోనే ఒక నివేదికను సమర్పించినట్లు దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. ఇందులో హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ పాత్ర కీలకమని ఆయన ఆరోపించారు. ఆయనను వెంటనే బర్తరఫ్ చేసిన విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. హోంమంత్రి దేశ్‌ముఖ్ పదవిలో కొనసాగితే న్యాయమైన దర్యాప్తు సాధ్యం కానందున ఆయనను తొలగించాలన్నారు. ఇదిలావుంటే, మహారాష్ట్ర ప్రభుత్వం తక్షణమే గద్దె దిగాలని పార్లమెంట్‌ లో బీజేపీ డిమాండ్‌ చేయగా, మంత్రిపై సీబీఐతో నిష్పాక్షిక దర్యాప్తు జరిపించాలని పరమ్‌బీర్‌సింగ్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఇదీ చదవండిః West Bengal Elections 2021 : బెంగాల్‌లో ఆ సామాజిక వర్గం అండ లేనిది గెలవడం కష్టం.. ఎందుకో తెలుసా..