బీజేపీ అభ్యర్థుల ఫైనల్ లిస్టులో ‘డిస్కో డ్యాన్సర్’ పేరు గాయబ్, మొదట ప్రచారానికే పరిమితమా ?
బెంగాల్ అసెంబ్లీ తొలిదశ ఎన్నికలకు బీజేపీ ప్రకటించిన ఫైనల్ అభ్యర్థుల జాబితాలో బాలీవుడ్, బెంగాలీ నటుడు మిథున్ చక్రవర్తి పేరు లేదు. ఈ లిస్టులో 13 మంది అభ్యర్థుల పేర్లు ఉన్నాయి.అయితే...
బెంగాల్ అసెంబ్లీ తొలిదశ ఎన్నికలకు బీజేపీ ప్రకటించిన ఫైనల్ అభ్యర్థుల జాబితాలో బాలీవుడ్, బెంగాలీ నటుడు మిథున్ చక్రవర్తి పేరు లేదు. ఈ లిస్టులో 13 మంది అభ్యర్థుల పేర్లు ఉన్నాయి. రషబేహారీ నియోజకవర్గం నుంచి ఈయనకు టికెట్ ఇవ్వవచ్చునని భావించినప్పటికీ ఇక్కడ రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ సుబ్రతా సాహాకు టికెట్ లభించింది. ఈయన ఇన్నేళ్లూ కాశ్మీర్ లో బీజేపీ ఇన్-ఛార్జ్ గా ఉన్నారు. ఇక దక్షిణ కోల్ కతా సీటును మిథున్ కి రిజర్వ్ చేస్తారని భావించినా అది కూడా జరగలేదు. ఈ నెల 7 న కోల్ కతా లోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన ఎన్నికల ర్యాలీలో మిథున్ ..ప్రధాని మోదీ రావడానికి ముందు పాల్గొన్నారు. కాగా తన ఓటర్ కార్డును ఈయన ముంబై నుంచి కోల్ కతా కు మార్చుకున్నాడు. బెంగాల్ తొలి దశ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న మిథున్ ఆశలు ఆవిరయ్యాయి. అయితే ఇంకా ఏడు దశలు ఉన్నాయి గనుక ఈ నటుడు కమ్ పొలిటీషియన్ కి వచ్చిన నష్టమేమీ లేదు. ఎన్నికల తుది దశకు నామినేషన్ దాఖలు చేయడానికి ఇంకా ఏప్రిల్ రెండో వారం వరకు సమయం ఉంది.
నందిగ్రామ్ నియోజకవర్గంలో ఈ నెల 30 న బీజేపీ అభ్యర్థి సువెందు అధికారి తరఫున మిథున్ ప్రచారం చేయనున్నాడు. తన పాత బెంగాలీ చిత్రాల్లోని డైలాగులతో మిథున్ ఓటర్లను ఆకట్టుకోగలడని బీజేపీ ఆశిస్తోంది. అయితే ఇంతకు మించి ఇటీవల ప్రధాని మోదీ బంకూరా, పురూలియా వంటి నియోజకవర్గాల్లో చేసిన ప్రచారం వారిని బాగా ప్రభావితం చేసిందని భావిస్తున్నారు. ‘దీదీ ! మీరు నా తలపై తన్నాలని కోరుకుంటే అలాగే చేయండి.. కానీ ఈ బెంగాలీల కలలను మాత్రం చిదిమేయకండి’ అంటూ ఆయన హావ భావాలతో ప్రసంగించిన విషయం గమనార్హం. తృణమూల్ నుంచి బీజేపీలోకి వలసల పర్వం కొనసాగుతున్న నేపథ్యంలో కమలనాథులు మంచి దూకుడులో ఉన్నారు.
మరిన్ని చదవండి ఇక్కడ :నీకు కడుపు పండాలీ అంటే చిన్నారిని బలివ్వాలీ అని చెప్పగానే నమ్మింది..!చివరికి ఇలా..:Women believes a child is sacrified Video.
ఈ చింపాంజీ చేష్టలు చూస్తే నవ్వుఆపుకోలేరు.. వైరల్ వీడియో : chimpanzee antics funny video