ఈ సమస్యలు ఉన్నవారు జీడిపప్పు జోలికి అస్సలు వెళ్లకండి..!

Jyothi Gadda

30 April 2025

నట్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా బాదం, జీడిపప్పు, వాల్‌నట్స్‌ ఎక్కువ పోషకాలు ఉన్నాయి. అయితే, కొన్ని సమస్యలు ఉన్నవారు ఈ జీడిపప్పుకి దూరంగా ఉండడం మంచిది. 

నట్స్ అలర్జీ ఉన్నవారు జీడిపప్పులు తినడం అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. కొంతమందికి నట్స్ తినడం మంచిది కాదు. కాబట్టి, జీడిపప్పులు తినే ముందు ఆలోచించాలి.

కొంతమందిలో జీడిపప్పులు తినటం వల్ల అలర్జీలను పెంచే గుణం ఉంటుంది. కాబట్టి, వీటిని తినకపోవడమే మంచిదని వైద్య ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

జీడిపప్పుల్లో ఎక్కువగా కేలరీలు ఉంటాయి. కాబట్టి, వీటిని తినడం వల్ల అధికబరువు పెరుగుతారు. ముఖ్యంగా, ఫ్రై చేసినప్పుడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అందుకే ఎక్కువగా తినడం మంచిది 

అంతేకాకుండా జీడిపప్పులు తింటే ఆక్సలేట్స్‌ని ఏర్పడుతుంది. ఇది రాళ్ళు ఏర్పడేలా చేస్తుంది. కాబట్టి, వీటిని తినే ముందు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

కిడ్నీ సమస్యలు ఉన్నవారు కూడా జీడిపప్పు తినకూడదు. ఇందులో ఫాస్పరస్ ఎక్కువగా ఉంటుంది. ఇది కిడ్నీలకు మంచిది కాదు. అందుకే, ఈ జీడిపప్పులు తినకపోవడం మంచిది.

జీడిపప్పు ఎక్కువగా కొవ్వు, కేలరీలతో నిండిఉన్నాయి. అతిగా తినడం వల్ల శరీర బరువు పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా బరువు పెరుగుదల సమస్యలను ఎదుర్కొంటున్న వారికి.

జీడిపప్పు ఎక్కువగా కార్బోహైడ్రేట్లు కలిగివుంటాయి. ఎక్కువగా తినడం ద్వారా రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరిగే అవకాశముంది. మధుమేహం ఉన్నవారికి జీడిపప్పు తినడంలో పరిమితి ఉండాలి.