వెంకయ్యకు ‘మహానటి’ పాదాభివందనం..!

66వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం ఢిల్లీలో అట్టహాసంగా జరిగింది. విజ్ఞాన్‌భవన్‌లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అవార్డులను ప్రదానం చేశారు. మహానటి చిత్రంలో అద్భుతమైన నటన కనబర్చిన కీర్తి సురేశ్ జాతీయ ఉత్తమనటి అవార్డును వెంకయ్య చేతులమీదుగా అందుకున్నారు. ఈ కార్యక్రమానికి నిండైన చీరకట్టులో వచ్చిన కీర్తి వేదికపై ఉన్న వెంకయ్య పాదాలకు నమస్కరించారు. కాగా అటు డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ కూడా వెంకయ్యనాయుడు చేతుల మీదుగా అవార్డు తీసుకున్నారు. బెస్ట్ ఫిల్మ్‌గా అండ్ బెస్ట్ మూవీగా […]

వెంకయ్యకు 'మహానటి' పాదాభివందనం..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Dec 24, 2019 | 3:39 PM

66వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం ఢిల్లీలో అట్టహాసంగా జరిగింది. విజ్ఞాన్‌భవన్‌లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అవార్డులను ప్రదానం చేశారు. మహానటి చిత్రంలో అద్భుతమైన నటన కనబర్చిన కీర్తి సురేశ్ జాతీయ ఉత్తమనటి అవార్డును వెంకయ్య చేతులమీదుగా అందుకున్నారు. ఈ కార్యక్రమానికి నిండైన చీరకట్టులో వచ్చిన కీర్తి వేదికపై ఉన్న వెంకయ్య పాదాలకు నమస్కరించారు. కాగా అటు డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ కూడా వెంకయ్యనాయుడు చేతుల మీదుగా అవార్డు తీసుకున్నారు. బెస్ట్ ఫిల్మ్‌గా అండ్ బెస్ట్ మూవీగా నాగ్ అశ్విన్ అవార్డును అందుకున్నారు. అలాగే.. చి.లా.సౌ సినిమాకి ఒరిజినల్ స్క్రీన్‌ ప్లే అవార్డును నటుడు రాహుల్ అందుకున్నారు.

అటు సామాజిక చైతన్యం కలిగించే చిత్రం ప్యాడ్‌మాన్‌కు కూడా అవార్డ్‌ దక్కింది. అక్షయ్‌కుమార్‌- ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు తీసుకున్నారు. పీరియడ్స్‌పై మహిళల్లో చైతన్యం కల్పించేలా ప్యాడ్‌మాన్‌ సినిమా తీశారు. ఇక ఉత్తమ నటులుగా విక్కీ కౌశల్, ఆయుష్మాన్ ఖురానా అవార్డులు అందుకున్నారు. ఉత్తమ దర్శకుడిగా యురి సినిమాకుగాను ఆదిత్య ధర్‌కు పురస్కారం ప్రదానం చేశారు.

మరోవైపు… జాతీయ చలనచిత్ర అవార్డులను సొంతం చేసుకున్న విజేతలకు ఈ నెల 29న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తేనీటి విందును ఇవ్వనున్నారు. ఈ ఏడాది దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు బిగ్‌బిని వరించినప్పటికీ.. అనారోగ్య కారణాల వల్ల ఆయన ఈ వేడుకలకు హాజరుకాలేకపోయారు. దీంతో తేనీటి విందు ఏర్పాటు చేసిన రోజే అమితాబ్‌కు దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డును అందచేయనున్నారు.