న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌: యూత్‌కి పోలీసుల షాకింగ్ న్యూస్!

2020 న్యూయర్ సెలబ్రేషన్స్‌లో భాగంగా యువతకు షాక్ ఇచ్చారు హైదరాబాద్ పోలీసులు. ఈసారి జరిగే వేడుకలకు సింగిల్స్‌కి ఎంట్రీ లేదని చెప్పారు. కపుల్ ఎంట్రీస్ కానీ లేదా బంధువులతో కానీ ఈ సెలబ్రేషన్స్‌లో పాల్గొనాలని పోలీసులు సూచించారు. ఇప్పటికే హైదరాబాద్ నగర వ్యాప్తంగా న్యూయర్ సన్నాహాలకు యువత సిద్ధమవుతోంది. అటు పలు పబ్‌లు, రెస్టారెంట్‌లు అదిరిపోయే ఆఫర్లతో రెడీ అయిపోయాయి. సాధారణంగానే.. యువత జనవరి 1ను ఇన్‌వైట్ చేస్తూ.. డిసెంబర్ 31 అర్థరాత్రి నుంచే పబ్‌ల్లో, రోడ్లమీద […]

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌: యూత్‌కి పోలీసుల షాకింగ్ న్యూస్!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Dec 23, 2019 | 5:39 PM

2020 న్యూయర్ సెలబ్రేషన్స్‌లో భాగంగా యువతకు షాక్ ఇచ్చారు హైదరాబాద్ పోలీసులు. ఈసారి జరిగే వేడుకలకు సింగిల్స్‌కి ఎంట్రీ లేదని చెప్పారు. కపుల్ ఎంట్రీస్ కానీ లేదా బంధువులతో కానీ ఈ సెలబ్రేషన్స్‌లో పాల్గొనాలని పోలీసులు సూచించారు.

ఇప్పటికే హైదరాబాద్ నగర వ్యాప్తంగా న్యూయర్ సన్నాహాలకు యువత సిద్ధమవుతోంది. అటు పలు పబ్‌లు, రెస్టారెంట్‌లు అదిరిపోయే ఆఫర్లతో రెడీ అయిపోయాయి. సాధారణంగానే.. యువత జనవరి 1ను ఇన్‌వైట్ చేస్తూ.. డిసెంబర్ 31 అర్థరాత్రి నుంచే పబ్‌ల్లో, రోడ్లమీద న్యూయర్ వేడుకలకు శ్రీకారం చుడుతూంటారు. అయితే.. ఈ వేడుకల్లో మహిళల సింగిల్స్ ప్రవేశాన్ని రద్దు చేస్తూ పలు సూచనలు జారీ చేశారు పోలీసులు. మహిళలు ఖచ్చితంగా కపుల్స్‌తో కానీ, వారికి సంబంధించిన బంధువులతో కానీ రావాలని రాచకొండ పోలీసులు హెచ్చరించారు. గత కొద్ది రోజులుగా మహిళలపై జరుగుతోన్న దాడుల దృష్ట్యా తాజాగా పోలీసులు ఈ నిబంధనలను ప్రవేశపెట్టారు.

ఈ రూల్స్ ఖచ్చితంగా పాటించాలని ఈవెంట్ నిర్వాహకులందరినీ పోలీసులు కోరారు. న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ జరిగే అన్ని ప్రదేశాల వివరాలు తమకు ఇవ్వాలని, సరైన భద్రతా ప్రమాణాలను పాటించాలని వారు పేర్కొన్నారు. కాగా ఈ కింద తెలిపిన సూచనలను తూచ తప్పకుండా ఫాలో చేయాలన్నారు పోలీసులు.

  • న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో డీజేలకు అనుమతి లేదు. ఉన్నా 45 డెసిబెల్స్ మించి శబ్ధం ఉండకూడదు.
  • నగ్న, అర్థనగ్న డ్యాన్స్‌లు నిషేధం
  • అశ్లీల ఫొటోలు, దృశ్యాలను ప్రదర్శించకూడదు
  • అనుమతి లేకుండా మద్యం సరఫరా చేయకూడదు
  • ప్రజలకు ప్రమాదం కలిగించే అంశాలను వేడుకల్లో నిర్వహించకూడదు
  • న్యూ ఇయర్ పార్టీలు నిర్వహించే యాజమాన్యం అగ్నిమాపక శాఖ నిబంధనలను పాటించాలి
  • రాత్రి 8 నుంచి 11 గంటల వరకు మాత్రమే పబ్‌లకు, పార్టీలకు సమయం కేటాయించాలి
  • తాగి డ్రైవింగ్ చేసే వారికి 10 వేల జరిమానాతో పాటు కోర్టులో ఖచ్చితంగా హాజరవ్వాలి
  • వేడుకల్లో గేమింగ్ వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలను నిర్వహించరాదు.