3 రాజధానుల వ్యూహం వెనుక రహస్యమదే! రివీల్ చేసిన చంద్రబాబు

ఆంధప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులను ప్రతిపాదించడం వెనుక రహస్యం తనకు తెలుసంటున్నారు తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అనడమే కాదు.. సోమవారం తుళ్ళూరు ప్రాంతంలో పర్యటించిన చంద్రబాబు మూడు రాజధానుల వెనుక వ్యూహం ఇదేనని చెప్పేశారు. దాంతో చంద్రబాబు మాటలు విన్న తుళ్ళూరు ప్రాంత రైతాంగం అవాక్కయ్యారు. ఏపీకి మూడు రాజధానులుండాలని జిఎన్ రావు కమిటీ ప్రతిపాదించిన నాటి నుంచి ఆందోళన బాట పట్టిన అమరావతి రాజధాని ప్రాంత రైతాంగానికి చంద్రబాబు సోమవారం […]

3 రాజధానుల వ్యూహం వెనుక రహస్యమదే! రివీల్ చేసిన చంద్రబాబు
Follow us

|

Updated on: Dec 23, 2019 | 5:10 PM

ఆంధప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులను ప్రతిపాదించడం వెనుక రహస్యం తనకు తెలుసంటున్నారు తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అనడమే కాదు.. సోమవారం తుళ్ళూరు ప్రాంతంలో పర్యటించిన చంద్రబాబు మూడు రాజధానుల వెనుక వ్యూహం ఇదేనని చెప్పేశారు. దాంతో చంద్రబాబు మాటలు విన్న తుళ్ళూరు ప్రాంత రైతాంగం అవాక్కయ్యారు.

ఏపీకి మూడు రాజధానులుండాలని జిఎన్ రావు కమిటీ ప్రతిపాదించిన నాటి నుంచి ఆందోళన బాట పట్టిన అమరావతి రాజధాని ప్రాంత రైతాంగానికి చంద్రబాబు సోమవారం మరోసారి సంఘీభావం ప్రకటించారు. తుళ్ళూరులో ఆందోళన చేస్తున్న రైతులను కలుసుకుని మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన రైతులనుద్దేశించి ప్రసంగించారు.

అభివృద్ధి అంటే..సెక్రటేరియట్, అసెంబ్లీ కడితే రాదని చంద్రబాబు అన్నారు. పరిశ్రమలు,పెట్టుబడులు, సాఫ్ట్‌వేర్ కంపెనీలు రావాల్సి వుంటుందని చెప్పారు చంద్రబాబు. శ్రీకాకుళం, వైజాగ్ తుఫాన్ల సమయంలో తానక్కడే 4 రోజుల పాటు ఉండి సహాయక చర్యలు పర్యవేక్షించానని, తాను పిలుపునిస్తే అందరు నడుం కట్టి పని చేశారని ఆయన వివరించారు.

మూడు రాజధానులు దేశంలో ఏ రాష్ట్రానికి లేవని, సచివాలయం అంటే ఉద్యోగస్తులు ఒకరే కాదు..మంత్రులు కూడా ఉండాల్సి వుంటుందని.. ఇవేవీ తెలియని జగన్… మూడు రాజధానుల పేరుతో రాష్ట్రంలోని ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి, తన పబ్బం గడుపుకోవడమే జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన వెనుక అసలు వ్యూహమని ఆయన విమర్శించారు.

అమరావతి ప్రాంతం ఒక ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గమని, కానీ ఈ ప్రాంతంలో ఒకవర్గం ప్రజలు ఉన్నారు కాబట్టి మిగిలిన అందరినీ జగన్ బాధ పెడుతున్నారని చంద్రబాబు ముఖ్యమంత్రిపై కామెంట్ చేశారు. అమరావతి ఒక చరిత్రాత్మక నగరమని, అందుకోసమే రాజధానిగా ఎంపిక చేశామని చెప్పారయన. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి తెలుగుదేశం పార్టీ అమరావతి కోసం భూములను త్యాగం చేసిన రైతులకు అండగా వుంటుందని చంద్రబాబు హమీ ఇచ్చారు.