ఎన్ఆర్సీపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..!
దేశవ్యాప్తంగా బీజేపీ ప్రవేశపెట్టిన ఎన్ఆర్సీపై ఏపీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్‌ఆర్సీకి రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఇవ్వదని.. తమ పార్టీ పూర్తిగా వ్యతిరేకమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎన్‌ఆర్సీని అమలు చేసే ప్రసక్తే లేదని.. మైనార్టీలకు తమ ప్రభుత్వం ఎప్పుడూ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. కడప జిల్లాలో పర్యటించిన సీఎం జగన్.. వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక సీఎం చేసిన […]

దేశవ్యాప్తంగా బీజేపీ ప్రవేశపెట్టిన ఎన్ఆర్సీపై ఏపీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్‌ఆర్సీకి రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఇవ్వదని.. తమ పార్టీ పూర్తిగా వ్యతిరేకమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎన్‌ఆర్సీని అమలు చేసే ప్రసక్తే లేదని.. మైనార్టీలకు తమ ప్రభుత్వం ఎప్పుడూ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.
కడప జిల్లాలో పర్యటించిన సీఎం జగన్.. వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక సీఎం చేసిన ఈ వ్యాఖ్యలకు డిప్యూటీ సీఎం అంజద్ బాషా కూడా మద్దతు పలికారు. ముస్లింలకు ఎప్పుడూ వైసీపీ ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. కాగా, ఇటీవల కేంద్ర హోం మినిస్టర్ అమిత్ షా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన పౌరసత్వ బిల్లుకు వైసీపీ మద్దతుగా ఓటేసిన సంగతి తెలిసిందే.