భారీ రేటుకు అమ్ముడుపోయిన కేజీఎఫ్-2 డిజిటల్ రైట్స్

కన్నడ స్టార్ యష్ నటించిన 'కేజీఎఫ్' సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంత సంచలనం క్రియేట్ చేసిందో తెలిసిందే. బంగారు గనుల కథాంశంతో.. పవర్ ఫుల్ డైలాగ్స్‌లో ఆకట్టుకుంది అందర్నీ ఆకట్టుకుందీ చిత్రం. అన్ని భాషల్లోనూ రిలీజైన ఈ సినిమా..

  • Tv9 Telugu
  • Publish Date - 4:48 pm, Thu, 7 May 20
భారీ రేటుకు అమ్ముడుపోయిన కేజీఎఫ్-2 డిజిటల్ రైట్స్

కన్నడ స్టార్ యష్ నటించిన ‘కేజీఎఫ్’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంత సంచలనం క్రియేట్ చేసిందో తెలిసిందే. బంగారు గనుల కథాంశంతో.. పవర్ ఫుల్ డైలాగ్స్‌లో ఆకట్టుకుంది అందర్నీ ఆకట్టుకుందీ చిత్రం. అన్ని భాషల్లోనూ రిలీజైన ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది. అలాగే ఈ సినిమాతో నటుడు యష్ ఫుల్ పాపులర్ అయ్యాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంకు.. ఇప్పుడు సీక్వెల్‌గా ‘కేజీఎఫ్-2’ తెరకెక్కుతోంది.

కాగా ఇప్పటికే కేజీఎఫ్-2లో ఫేమస్ యాక్టర్లు నటిస్తున్నారని సమాచారం. తాజాగా ఈ సీక్వెల్‌లో తమన్నా యష్‌కి జోడీగా నటిస్తోందని ఓ న్యూస్ వైరల్ అవుతోంది. అయితే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. అలాగే ఇప్పుడు బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ అధిర పాత్రలో నటిస్తున్నారట. అలాగే రమ్యకృష్ణ, రవీనా టాండన్ కూడా సెకండ్ పార్ట్‌లో నటిస్తున్నారని సమాచారం.

అయితే కేజీఎఫ్-2 విడుదలకు ముందే ఈ సినిమా డిజిటల్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ భారీ రేటు పెట్టి కొనేసిందట. కాగా ఇప్పటికే కేజీఎఫ్ మొదటి పార్ట్‌ని కూడా అమెజాన్ ప్రైమ్ భారీ రేటుకు కొనుక్కొని ప్రసారం చేసింది. తాజాగా కేజీఎఫ్-2 డిజిటల్ రైట్స్ అన్ని భాషలనూ కలిపి రూ.55 కోట్లకు కొనుగోలు చేసినట్టు సమాచారం. మొత్తానికి కేజీఎఫ్ సృష్టించిన సంచలనంతో ఇప్పుడు కేజీఎఫ్-22 మూవీపై అన్ని భాషల్లోనూ భారీ డిమాండ్ ఏర్పడింది.

Read More:

బ్రేకింగ్: మృతుల కుటుంబాలకి రూ. కోటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన జగన్

లాక్‌డౌన్: ప్రైవేటు స్కూళ్లలో 50 శాతం ఫీజు కడితే చాలట