AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కిమ్ మరణం వెనుక రహస్యమిదే.. దేశద్రోహులు గుర్తింపు.. వారికి చావే గతి!

పూర్వకాలంలో రాజులు తమ రాజ్యంలో అంతర్గత సంక్షోభం ఎదురైనప్పుడు చక్కటి ప్రణాళికను రచించి సడన్‌గా మాయమవుతుంటారు. ఇక అప్పటివరకు పీఠంపై కన్నేసిన కొందరు శత్రుదేశాలతో చేతులు కలిపి కుట్రలకు తెరలేపుతారు. అయితే అంతవరకు చనిపోయాడని అనుకున్న రాజు అనూహ్యంగా ప్రత్యేక్షమై దేశద్రోహుల ఆటను కట్టిస్తారు. వినడానికి ఇది ఒక సినిమా స్టోరీలా ఉన్నా.. ఇప్పటికీ కొంతమంది నాయకులు ఈ చందమామ కథల్లోని ఎత్తుగడలనే ఫాలో అవుతుంటారు. అప్పట్లో హిట్లర్, ఆ తర్వాత సద్దాం హుస్సేన్.. ఇప్పుడు నార్త్ […]

కిమ్ మరణం వెనుక రహస్యమిదే.. దేశద్రోహులు గుర్తింపు.. వారికి చావే గతి!
Ravi Kiran
|

Updated on: May 07, 2020 | 10:02 PM

Share

పూర్వకాలంలో రాజులు తమ రాజ్యంలో అంతర్గత సంక్షోభం ఎదురైనప్పుడు చక్కటి ప్రణాళికను రచించి సడన్‌గా మాయమవుతుంటారు. ఇక అప్పటివరకు పీఠంపై కన్నేసిన కొందరు శత్రుదేశాలతో చేతులు కలిపి కుట్రలకు తెరలేపుతారు. అయితే అంతవరకు చనిపోయాడని అనుకున్న రాజు అనూహ్యంగా ప్రత్యేక్షమై దేశద్రోహుల ఆటను కట్టిస్తారు. వినడానికి ఇది ఒక సినిమా స్టోరీలా ఉన్నా.. ఇప్పటికీ కొంతమంది నాయకులు ఈ చందమామ కథల్లోని ఎత్తుగడలనే ఫాలో అవుతుంటారు. అప్పట్లో హిట్లర్, ఆ తర్వాత సద్దాం హుస్సేన్.. ఇప్పుడు నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తన దేశంలో ఉన్న అంతర్గత శత్రువులను గుర్తించడానికి ఇదే తరహా వ్యూహాన్ని రచించాడు.

తమలాంటి డూప్‌లను రంగంలోకి దింపడం.. ఫేక్ డెత్ న్యూస్ క్రియేట్ చేయడం ద్వారా లోపలి శత్రువులను గుర్తించి చంపి పారేస్తుంటారు నియంతలు. డిక్టేటర్ కిమ్ జోంగ్ ఉన్ కూడా సరిగ్గా ఇలాంటి స్కెచే ఒకటి వేశాడని తెలుస్తోంది. అంతర్జాతీయంగా విధించిన ఆంక్షలు, కరోనా వైరస్ కారణంగా చైనా నుంచి వచ్చే సాయం కూడా కొద్దికాలంగా అందకపోవడంతో నార్త్ కొరియా తీవ్ర ఆర్ధిక సంక్షోభంలోకి వెళ్లే పరిస్థితి ఏర్పడిందని సమాచారం. ఈ క్రమంలోనే ప్రజల్లో ఉన్న తన పాపులారిటీని దిగజార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుసుకుని.. ఆ ద్రోహులను కనిపెట్టేందుకు కిమ్ అజ్ఞాతంలోకి వెళ్లి.. తన మరణ వార్తలను ప్రపంచమీడియాలోకి ప్రచారం చేశాడని తాజా రిపోర్టులో తేలింది.

ఆ దేశంలో ఉన్న ఒకరిద్దరికి మినహాయించి.. మిగిలిన ఎవరికీ కూడా కిమ్ జాడ తెలియకపోవడంతో.. ఆయన వారసుడిని ఎంపిక చేసే క్రమంలో కిమ్ యో జోంగ్‌కు పగ్గాలు కట్టబెట్టేందుకు వర్కర్స్ పార్టీ ముఖ్యులు ప్రయత్నించారని.. ఇదంతా కూడా కిమ్ ఆడిన నాటకమేనని స్కై న్యూస్ ఆస్ట్రేలియా కొన్ని ఆధారాలతో ఓ కధనాన్ని ప్రచురించింది. సరిగ్గా గతంలో రష్యా నియంత జోసెఫ్ స్టాలిన్ తరహా టెక్నీక్‌నే కిమ్ వాడారని ఆ రిపోర్టులో పేర్కొన్నారు.

ఈ వ్యూహంతో అసలు శత్రువులు ఎవరో బయటపడినట్లు తెలుస్తోంది. ఒకప్పుడు కిమ్‌కు అత్యంత సన్నిహితంగా ఉంటూ.. వెన్నుపోటు పొడిచి సౌత్ కొరియా పారిపోయిన ఉ.కొరియా మాజీ రాయబారి తాయ్ యాంగ్ హో, జి షెయాంగ్ హోలట. ప్రస్తుతం వీరిద్దరూ సౌత్ కొరియా జాతీయ అసెంబ్లీ సభ్యులుగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో కిమ్ గురించే వీళ్లు చెప్పే చిన్న విషయాలు కూడా సౌత్ కొరియా ప్రభుత్వం చాలా ప్రాధాన్యతను ఇస్తుంది. ఇక కిమ్ చనిపోయాడన్న విషయాన్ని వీళ్లు ధృవీకరించారు. కానీ సడన్‌గా నియంత తిరిగి రావడంతో ఖంగుతిన్నారు. ఇక తాజాగా కిమ్ డూప్ అంటూ వార్తలు వస్తున్నా.. ఇదంతా కూడా ఆధునిక స్టాలిన్ ప్లాన్‌లో ఓ భాగమేనని టాక్ నడుస్తోంది.

Read This: ఆ రాష్ట్రంలో ‘నమస్తే ట్రంప్’ వల్లే కరోనా వ్యాప్తి జరిగిందట..