AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బైక్‌పై వెనుక కూర్చున్న వ్యక్తికి హెల్మెట్ లేకపోతే చలాన్ ఎవరు చెల్లించాలి? ట్రాఫిక్ రూల్స్ ఇవే!

ద్విచక్ర వాహనంపై రైడర్, వెనుక కూర్చున్న వ్యక్తి ఇద్దరూ హెల్మెట్ ధరించడం తప్పనిసరి. వెనుక కూర్చున్నవారు హెల్మెట్ ధరించకపోతే, రైడర్‌కే చలాన్ పడుతుంది. మోటార్ వాహనాల చట్టంలోని సెక్షన్ 194D ప్రకారం రూ.1000 వరకు జరిమానాతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ సస్పెన్షన్ కూడా కావొచ్చు. భద్రతకు హెల్మెట్ ఎంత ముఖ్యమో, జరిమానాలు తప్పించుకోవడానికి కూడా ఈ నిబంధన పాటించాలి.

బైక్‌పై వెనుక కూర్చున్న వ్యక్తికి హెల్మెట్ లేకపోతే చలాన్ ఎవరు చెల్లించాలి? ట్రాఫిక్ రూల్స్ ఇవే!
Traffic Rules
Balaraju Goud
|

Updated on: Aug 15, 2026 | 3:34 PM

Share

బైక్ లేదా స్కూటర్‌పై ప్రయాణించే ప్రతి ఒక్కరి భద్రత కోసం హెల్మెట్ ధరించడం అత్యంత ముఖ్యం. కేవలం వాహనం నడిపే వ్యక్తే కాకుండా.. వెనుక కూర్చునే వ్యక్తి కూడా హెల్మెట్ ధరించాల్సిన నిబంధనలు ఉన్నాయి. హెల్మెట్ లేకుండా ప్రయాణించడం ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనగా పరిగణిస్తారు. అయితే వెనుక కూర్చున్న వ్యక్తి హెల్మెట్ పెట్టుకోకపోతే చలాన్ ఎవరి పేరుపై పడుతుంది? అనే సందేహం చాలామందికి ఉంటుంది.

చలాన్ ఎవరు చెల్లించాలి?

సాధారణంగా ద్విచక్ర వాహనంపై రైడర్ హెల్మెట్ ధరించి ఉన్నప్పటికీ.. వెనుక కూర్చున్న వ్యక్తి హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే, నిబంధన ఉల్లంఘనకు సంబంధించి బాధ్యత రైడర్‌పై పడే అవకాశం ఉంటుంది. అంటే వెనుక కూర్చున్న వ్యక్తి హెల్మెట్ పెట్టుకున్నాడా లేదా అనే విషయాన్ని రైడర్ కూడా నిర్ధారించుకోవాలి. ఇది కేవలం జరిమానా తప్పించుకోవడానికి సంబంధించిన విషయం కాదు. ప్రమాదం జరిగినప్పుడు వెనుక కూర్చున్న వ్యక్తికి కూడా తలకు తీవ్ర గాయాలు అయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే బైక్‌పై ఇద్దరూ ప్రయాణిస్తే ఇద్దరూ హెల్మెట్ ధరించడం అత్యవసరం.

హెల్మెట్ లేకుండా పట్టుబడితే?

మోటార్ వాహనాల చట్టంలోని సెక్షన్ 194D కింద హెల్మెట్ నిబంధన ఉల్లంఘనకు జరిమానా విధించే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో రూ. 1,000 వరకు జరిమానాతో పాటు డ్రైవింగ్ లైసెన్స్‌ను నిర్దిష్ట కాలానికి సస్పెండ్ చేసే చర్యలు కూడా ఉంది. అయితే అమలు చేసే విధానం, జరిమానా మొత్తం రాష్ట్రం, స్థానిక ట్రాఫిక్ నిబంధనల ఆధారంగా మారవచ్చు. కాబట్టి మీ ప్రాంతంలో అమల్లో ఉన్న తాజా ట్రాఫిక్ నిబంధనలను కూడా తెలుసుకోవడం మంచిది.

రైడర్ బాధ్యత మరింత కీలకం

బైక్ లేదా స్కూటర్‌పై వెనుక కూర్చున్న వ్యక్తి హెల్మెట్ ధరించకపోతే.. “అది నా బాధ్యత కాదు” అని రైడర్ తప్పించుకోలేడు. ప్రయాణం ప్రారంభించే ముందే వెనుక కూర్చున్న వ్యక్తికి హెల్మెట్ ఉందో లేదో చూసుకోవడం మంచిది. చిన్న నిర్లక్ష్యం జరిమానాకు దారితీయడమే కాకుండా ప్రాణాలకే ప్రమాదం కలిగించవచ్చు. అందుకే బైక్‌పై ఇద్దరూ ఉంటే.. ఇద్దరికీ హెల్మెట్ తప్పనిసరి.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us