ఇంట్లో ఎన్ని అద్దాలు ఉండాలి? ఏ దిశలో పెట్టాలి? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
15 August 2026
Rajashekher
వాస్తు నమ్మకాల ప్రకారం, అవసరానికి మించి ఇంట్లో అద్దాలు పెట్టుకోవడం మంచిది కాదని చెబుతారు. సాధారణంగా రెండు అద్దాలు సరిపోతాయని భావిస్తారు.
ఇంట్లో ఎన్ని అద్దాలు ఉండాలి?
ఒక అద్దాన్ని తూర్పు దిశలో, మరొకదాన్ని ఉత్తర దిశలో అమర్చుకోవచ్చని వాస్తు సూచనలు చెబుతున్నాయి. ఉత్తర దిశను సంపద, శ్రేయస్సుతో, తూర్పు దిశను సానుకూల శక్తితో ముడిపెడతారు.
తూర్పు, ఉత్తర దిశల్లో అద్దాలు
రెండు అద్దాలను ఒకే దిశలో ఉంచాల్సి వస్తే, వాటిని ఒకదానికొకటి ఎదురుగా లేదా మరీ దగ్గరగా పెట్టకూడదని చెబుతారు. ఇలా చేస్తే అద్దాలు పరస్పరం ప్రతిబింబించుకుంటాయి.
అద్దాలను ఎదురెదురుగా పెట్టొద్దు
బెడ్‌రూమ్‌లో అద్దం పెట్టేటప్పుడు ప్రత్యేక జాగ్రత్త తీసుకోవాలి. మంచం లేదా నిద్రిస్తున్న వ్యక్తి అద్దంలో ప్రతిబింబించకుండా చూసుకోవాలని వాస్తు నమ్మకాలు సూచిస్తున్నాయి.
పడకగదిలో అద్దం విషయంలో జాగ్రత్త
పడక లేదా శరీరం అద్దంలో ప్రతిబింబించేలా ఉంటే, రాత్రిపూట అద్దాన్ని వస్త్రంతో కప్పి ఉంచడం మంచిదని వాస్తు విశ్వాసం. ఇది నిద్రకు, దాంపత్య జీవితానికి సంబంధించిన ప్రతికూల ప్రభావాలను తగ్గిస్తుందని నమ్ముతారు.
రాత్రిపూట అద్దాన్ని..
బాత్రూంలో ఎక్కువ అద్దాలు పెట్టుకోవడం కంటే ఒక్క అద్దం ఉండటం మంచిదని భావిస్తారు. ఆ అద్దం ఎప్పుడూ శుభ్రంగా, పగుళ్లు లేకుండా ఉండేలా చూసుకోవాలి.
బాత్రూంలో ఒక్క అద్దం సరిపోతుంది
ఇంటి ప్రధాన ద్వారం ముందు నేరుగా అద్దాన్ని పెట్టకూడదని వాస్తు చెబుతుంది. ఇలా చేస్తే ఇంట్లోకి వచ్చే సానుకూల శక్తి తిరిగి బయటకు ప్రతిబింబిస్తుందని ఒక నమ్మకం ఉంది.
ప్రధాన ద్వారం ఎదురుగా అద్దం..
ప్రధాన ద్వారానికి ఎదురుగా కాకుండా, తలుపు పక్కన ఉన్న గోడపై అద్దాన్ని అమర్చుకోవచ్చని వాస్తు సూచనలు చెబుతున్నాయి. సరైన స్థానం, శుభ్రతతో ఉన్న అద్దాలు ఇంట్లో సానుకూల వాతావరణానికి అనుకూలంగా ఉంటాయని నమ్ముతారు.