AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చావునే చంపేసే ఆహార పదార్ధాలు.. వీటి ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవుతారు

మన వంటింట్లో సులభంగా లభించే కీర దోసకాయ, కరివేపాకు, పుదీనా కేవలం ఆహార పదార్థాలు మాత్రమే కాదు, అద్భుతమైన ఔషధాలు. శరీరంలో వేడిని తగ్గించడం, జీర్ణక్రియను మెరుగుపరచడం, నరాల బలహీనతను నివారించడం, జుట్టు మరియు చర్మ సౌందర్యాన్ని కాపాడటంలో ఇవి ఎలా ఉపయోగపడతాయో ప్రముఖ నిపుణులు అందించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

Phani CH
|

Updated on: Aug 15, 2026 | 3:41 PM

Share
ఈ ఉరుకుల పరుగుల జీవనశైలిలో జీర్ణ సమస్యలు, ఊబకాయం, నరాల బలహీనత, జుట్టు రాలడం వంటి సమస్యలు ప్రతి ఒక్కరినీ వేధిస్తున్నాయి. చిన్నపాటి అనారోగ్యానికి కూడా మందుల వైపు చూడకుండా, మన చుట్టూ ఉండే సహజసిద్ధమైన కూరగాయలు, ఆకుకూరలతో ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవచ్చో ప్రముఖ నిపుణులు వివరించారు.

1 / 5
కీర దోసకాయ ప్రయోజనాలు: కీర దోసకాయలో నీటి శాతం, పీచు పదార్థం పుష్కలంగా ఉంటాయి. భారీ భోజనం లేదా మసాలా ఫుడ్ తినే ముందు నాలుగు కీరా ముక్కలు తింటే కడుపులో చల్లని పొరలా ఏర్పడి అసిడిటీ, గ్యాస్ రాకుండా కాపాడుతుంది. ఇందులో ఉండే మెగ్నీషియం నరాల తిమ్మిర్లు, బలహీనతలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే విటమిన్ సి, విటమిన్ కె రోగనిరోధక శక్తిని పెంచుతాయి. లీటర్ నీటిలో కీరా ముక్కలు వేసి ఆ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ తాగితే మలబద్ధకం, పైల్స్ సమస్యలు తగ్గుతాయి. శరీర దుర్వాసన, అండర్ ఆర్మ్స్ నలుపు తగ్గడానికి కీరా రసాన్ని వాడటం మంచి ఫలితాన్నిస్తుంది.

2 / 5
కరివేపాకుతో లెక్కలేనన్ని లాభాలు: కూరల్లో కరివేపాకు వస్తే చాలామంది పక్కన పడేస్తుంటారు. కానీ కరివేపాకులో విటమిన్ ఎ, బి, సి, ఇ తో పాటు బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కరివేపాకును రోజూ ఆహారంలో భాగం చేసుకుంటే భవిష్యత్తులో తెల్లజుట్టు రాకుండా కాపాడుకోవచ్చు. కొబ్బరినూనెలో కరివేపాకు వేసి కాచి తలకు రాస్తే జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరుగుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతూ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కరివేపాకును ఎండబెట్టి పొడిలా చేసుకుని అన్నంలో నెయ్యితో కలిపి తీసుకుంటే ఎంతో మేలు జరుగుతుంది.

3 / 5
పుదీనా – సర్వరోగ నివారిణి: పుదీనా ఆకుల్లో విటమిన్ ఎ, ఐరన్, ఫోలేట్, మాంగనీస్ ఉంటాయి. ఇవి కంటి చూపును మెరుగుపరచడానికి దోహదపడతాయి. రోజువారీ ఆహారంలో లేదా నీటిలో పుదీనా మరిగించి తాగితే లివర్, కిడ్నీలు డిటాక్స్ అవుతాయి. నోటి దుర్వాసన సమస్య ఉన్నవారు రోజూ నాలుగైదు పుదీనా ఆకులు నమలడం లేదా పుదీనా రసంతో పుక్కిలించడం వల్ల చిగుళ్ల సమస్యలు దూరమవుతాయి. మొటిమలు, ముఖంపై మచ్చలు తగ్గడానికి పుదీనా రసాన్ని లేదా పుదీనా ఐస్ క్యూబ్స్‌ను ముఖానికి రుద్దడం ద్వారా చర్మం సహజసిద్ధమైన కాంతిని పొందుతుంది.

4 / 5
మనం రోజూ తీసుకునే సహజసిద్ధమైన ఆహారంలోనే అపారమైన ఔషధ గుణాలు దాగున్నాయి. కీర దోసకాయ, కరివేపాకు, పుదీనా వంటి వాటిని క్రమం తప్పకుండా తీసుకుంటూ ఆహారపు అలవాట్లను మార్చుకుంటే ఎలాంటి రోగాలు దరిచేరకుండా నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవించవచ్చని ప్రముఖ నిపుణులు సూచిస్తున్నారు.

5 / 5
Follow Us