గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీక‌రించిన హీరో సుశాంత్

తాజాగా ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో హీరో సుశాంత్ పాల్గొన్నాడు. హీరో అక్కినేని నాగ‌చైత‌న్య విసిరిన ఛాలెంజ్‌ను స్వీక‌రించి హీరో సుశాంత్ మొక్క‌లు నాటాడు. ఎంపీ సంతోష్ ప్రారంభించిన గొప్ప కార్య‌క్ర‌మంలో ప్ర‌తీ ఒక్క‌రినీ భాగ‌స్వాములు చేసినందుకు థ్యాంక్స్..

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీక‌రించిన హీరో సుశాంత్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 21, 2020 | 3:26 PM

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం మహా ఉద్యమంలా కొనసాగుతుంది. ఆయన పిలుపు మేరకు పలువురు సినీ ప్రముఖులు, క్రీడాకారులు, వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు ముందుకు వచ్చి మొక్కలు నాటడమే కాకుండా బాధ్యత తీసుకోని ఇతరుల చేత గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను పూర్తి చేయించడం జరుగుతుంది. తాజాగా ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో హీరో సుశాంత్ పాల్గొన్నాడు. హీరో అక్కినేని నాగ‌చైత‌న్య విసిరిన ఛాలెంజ్‌ను స్వీక‌రించి హీరో సుశాంత్ మొక్క‌లు నాటాడు. ఎంపీ సంతోష్ ప్రారంభించిన గొప్ప కార్య‌క్ర‌మంలో ప్ర‌తీ ఒక్క‌రినీ భాగ‌స్వాములు చేసినందుకు థ్యాంక్స్ అని తెలిపాడు. ఇక పూజా హెగ్డే, సుజీత్, ఐశ్వ‌ర్య రాజేష్, ప‌రుప‌ల్లి క‌శ్యాప్‌ల‌కు ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరాడు సుశాంత్‌.

Read More:

రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికీ వినాయ‌క చ‌వితి శుభాకాంక్ష‌లుః సీఎం జ‌గ‌న్‌

ప్రధాని మోదీకి ధ‌న్య‌వాదాలు తెలిపిన రైనా

ప్ర‌భాస్ ‘ఆది పురుష్’ గ్రాఫిక్స్‌ కోసం అంత ఖ‌ర్చా?

నాని ‘వి’ సినిమా ఆ రోజే రిలీజ్ ఎందుకో తెలుసా?